Dude | ‘డ్యూడ్’ మూవీ థియేటర్లలో ర‌చ్చ మాములుగా లేదు.. మొదటి రోజు కలెక్షన్స్ ఫుల్ హిట్టు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dude | ‘డ్యూడ్’ మూవీ థియేటర్లలో ర‌చ్చ మాములుగా లేదు.. మొదటి రోజు కలెక్షన్స్ ఫుల్ హిట్టు

 Authored By sandeep | The Telugu News | Updated on :18 October 2025,2:00 pm

Dude | ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమితా బైజు కథానాయికగా, శరత్ కుమార్, రోహిణి, హ్రిధు హరూన్, సత్యలు ఇతర ప్రముఖ పాత్రలు పోషించిన ‘డ్యూడ్’ సినిమా అక్టోబర్ 17, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేసి, న వీన్ ఎర్నేని, వై. రవి శంకర్లు మైథ్రి మూవీస్ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. సంగీతం సాయి అబ్యాంకర్ అందించారు.

#image_title

క‌లెక్ష‌న్స్ అదుర్స్..

సినిమా షూటింగ్ అనంతరం జరిపిన ప్రమోషన్స్‌కి మంచి స్పందన లభించింది. మొదటి రోజే రివ్యూస్ పాజిటివ్ గా వచ్చాయి. కామెడీ, లవ్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అయింది. సినిమా సెకండ్‌ హాఫ్‌లో సీరియస్, ఎమోషనల్ సీన్స్ బాగా పనిచేశాయి. ప్రదీప్ రంగనాథన్ నటన, కామెడీకి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. “డ్యూడ్” మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹15-16 కోట్ల కలెక్షన్స్ సాధించిందని టాక్ వినిపిస్తోంది. దీపావళి పండగ సీజన్ కావడంతో, రాబోయే రోజులలో కలెక్షన్లు ఇంకా పెరుగే అవకాశం ఉంది.

ప్రదీప్ రంగనాథన్‌కు వరుసగా మూడు రూ. 100 కోట్ల‌ గ్రాస్ సినిమాలు కావడం ఆసక్తికరం. గత చిత్రాలు లవ్ టుడే, డ్రాగన్ హిట్టుగా నిలిచాయి. అందువల్ల తెలుగులో ప్రదీప్‌కు మంచి గుర్తింపు ఏర్పడింది.మొత్తంగా “డ్యూడ్” ఫుల్ ఎంటర్‌టైనర్గా నిలిచింది. నవ్విస్తూ, ఏడిపిస్తూ ప్రేక్షకులను అనుభూతిపరుస్తూ థియేటర్ల వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి, సినిమా కలెక్షన్లు ఎంత రాబ‌డుతుందో చూడాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది