Karthika Deepam 14 Aug Today Episode : ప్రియమణి మీద డౌట్ వచ్చి.. స్టేషన్ కు తీసుకెళ్లిన ఏసీపీ రోషిణి.. మోనిత మర్డర్ కు, ప్రియమణికి ఏమైనా సంబంధం ఉందా?
Karthika Deepam 14 Aug Today Episode : కార్తీక దీపం 14 ఆగస్టు 2021, శనివారం ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. 1118 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌందర్య.. దీప చూపించిన వీడియో చూసి షాక్ అవుతుంది. మోనిత.. అంజిని బెదిరించే వీడియోను చూసి.. చేసే ఉంటాడు.. వాడు మోనితను చంపేసే ఉంటాడు.. అని అంటుంది సౌందర్య. మీరూ నమ్ముతున్నారా? అని దీప అడుగుతుంది. ఇది చూశాక.. ఎవ్వరికైనా ఆవేశం పొంగుకొస్తుంది.. అని అంటుంది. కరెక్టే కానీ.. ప్రాణం పోసే డాక్టర్ బాబు.. ప్రాణం తీస్తారంటే నేను నమ్మను. నా భర్త నిరపరాధి.. అని అంటుంది దీప.
ఆ వీడియో చూసి ఆవేశంలోనే అన్నయ్య ఇక్కడికి వచ్చి నీ రివాల్వర్ తీసుకొని ఉంటాడు మమ్మి.. అని ఆదిత్య అంటాడు. ఆదిత్య ఏంటి నువ్వు మాట్లాడేది.. ఇదేనా నువ్వు మీ అన్నయ్య గురించి తెలుసుకున్నది. ఆయన ఎప్పుడూ వివేకాన్ని వదేలయరు. ఆయనకు కోపం వచ్చి ఉండొచ్చు. ఆవేశం వచ్చి ఉండొచ్చు. అక్కడికి వెళ్లి ఉండొచ్చు. కానీ.. అంత నిర్ధాక్షిణ్యంగా ఆయన చంపారంటే మాత్రం నేను నమ్మను.. అని దీప అంటుంది. మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎలా కారణం అయ్యానో.. ఈ హత్యకు కూడా నేను అలాగే కారణం అయ్యాను.. అని దీపతో డాక్టర్ బాబు చెప్పడం చూసి.. డాక్టర్ బాబు ఈ హత్య చేయలేదు.. అని దీప అంటుంది. ఈ హత్యకు ఆయన కారణం కాదని నా మనస్సాక్షి నమ్ముతోంది. ఎప్పటికైనా ఇది నిజం అని రుజువు అయి తీరుతుంది.
వదినా.. రోషిణి అన్నయ్యను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఎందుకు ఈ హత్య చేయలేదని చెప్పలేదు.. అని ఆదిత్య ప్రశ్నిస్తాడు. ఏమో.. తొందరపడ్డాడేమో… వాడు. వివేకం కోల్పోయాడేమో.. అని సౌందర్య అంటుంది. వాడిలో ఎన్నాళ్ల నుంచో మోనిత నమ్మక ద్రోహం చేసిందన్న కోపంతో ఉన్నాడు.. అనగానే ఎందుకత్తయ్యా అందరూ ఇలా మాట్లాడుతున్నారు.. అని అంటుంది దీప.
అల్లుడు గారు ఎంత గొప్ప మనిషో నాకు తెలియదా? నేనెందుకు అబద్ధం చెబుతాను. నిన్ను వదలను.. నీలాంటిది బతకకూడదు. నిన్ను ఈ భూమ్మీదే లేకుండా చేస్తాను.. అని మోనితతో అనడం నేను కళ్లారా విన్నాను. ఆ తర్వాత నా చెవులకు రెండు సార్లు తూటాలు పేలిన శబ్దం వినిపించింది. తెల్లారి లేచి కట్లు విప్పుకొని చూసేసరికి.. హాల్ లో రక్తం ఉంది. వెంటనే ప్రియమణి పోలీసులను పిలిచింది. చంపాడు అనేది నిజం. నేనే సాక్ష్యం. అయినా సరే.. అటువంటిదాన్ని చంపినందుకు అల్లుడు గారు జైలు పాలు అవడం నాకు ఇష్టం లేదు.. డాక్టర్ బాబును ఎలా బయటికి తీసుకురావాలో అది ఆలోచించండి.. అని భాగ్య అంటుంది.
ఎవరు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను. నా భర్త ఈ హత్య చేయలేదు.. అంటుంది దీప. నేను ఆయన్ను చూడటానికి స్టేషన్ కు వెళ్తున్నాను అత్తయ్యా.. ఆయన ఏం తిన్నారో.. ఎప్పుడు తిన్నారో.. పలకరించే దిక్కు లేక ఎంత బాధపడుతున్నారో.. అనగానే వాళ్లు ఎవ్వరినీ కలవనియ్యడం లేదు.. అని అంటుంది సౌందర్య. నా తిప్పలేవో నేను పడతాను.. ఆయనకు భోజనం తీసుకెళ్తాను.. అంటుంది దీప.
కట్ చేస్తే ప్రియమణి రోడ్డు మీది నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. రోషిణి మేడమ్.. ప్రియమణిని చూసి కారు ఆపుతుంది. మేడమ్ గారు.. మీరా? మా అమ్మగారు.. నన్ను అమ్మ లాగా చూసుకున్నాను. కార్తీకయ్య పెళ్లి చేసుకుంటారని అమ్మగారు ఎంతో సంతోషపడితే.. ఉత్తి పుణ్యానికి కార్తీక్ చంపేశాడు. కార్తీక్ ను మాత్రం మీరు అస్సలు వదలకూడదు. మా అమ్మగారి శవాన్ని అయినా ఇప్పించండి అమ్మ. తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంటాను. కార్తీక్ ను గట్టిగా అడిగి తొందరగా అప్పజెప్పండి అమ్మ.. అని అంటుంది ప్రియమణి. కారు ఎక్కు.. అంటుంది ఏసీపీ. దీంతో నాకేం తెలియదు అమ్మా.. నేను వచ్చేసరికి అంతా జరిగింది.. అని భయపడుతుంది ప్రియమణి. ఎక్కు.. అంటూ బెదిరిస్తుంది ఏసీపీ.
Karthika Deepam 14 Aug Today Episode : డాక్టర్ బాబుకు క్యారేజ్ తీసుకెళ్లిన దీప
కట్ చేస్తే.. కార్తీక్ కు భోజనం తీసుకెళ్తుంది దీప. ముందు తనను పోలీస్ స్టేషన్ లోకి అనుమతించరు. కానీ.. లేడీ కానిస్టేబుల్ చూసి తనను లోపలికి తీసుకెళ్తుంది. భోజనం క్యారేజ్ ను తీసుకెళ్లి కార్తీక్ కు వడ్డిస్తుంది దీప. కట్ చేస్తే.. సౌందర్య.. తన భర్తతో మాట్లాడుతూ.. నేను హోం మినిస్టర్ దగ్గరికి వెళ్దాం అని అనుకుంటున్నాను అండి.. అని చెబుతుంది. ఆ మాటలను పిల్లలు సౌర్య, హిమ వింటారు. ఎందుకు నాయినమ్మా.. హోమ్ మినిస్టర్ దగ్గరికి ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నావు.. అని అడుగుతారు. నాన్న గురించి మాట్లాడటానికేనా? అంటే డాడీని పోలీసులు విడిచిపెట్టరా? వీళ్లు విడిచిపెట్టకపోతేనే కదా.. హోం మినిస్టర్ దగ్గరికి వెళ్లేది.. అని శౌర్య అంటుంది.
మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారు. మాకేం అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. మాతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడటం లేదు. అందరూ ఏడుస్తూనే ఉన్నారు. అసలు.. మాకు ఇంట్లోనే ఉండబుద్ధి కావడం లేదు. డాడీ లేకుండా ఎలా ఉండాలో కూడా తెలియడం లేదు. నాన్నను చూడకుండా ఉండలేకపోతున్నాం.. నాయినమ్మా. మమ్మల్ని నాన్న దగ్గరికి తీసుకెళ్లు నాయినమ్మా.. అని పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తారు. దీంతో పిల్లలను సౌందర్య ఓదార్చుతుంది.
కట్ చేస్తే.. దీప.. సెల్ లో ఉన్న కార్తీక్ ను చూసి షాక్ అవుతుంది. కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. దీంతో ఏంటి అలా చూస్తున్నావు దీప.. అంటే మిమ్మల్ని ఇలా చూస్తానని ఏనాడూ అనుకోలేదు డాక్టర్ బాబు అంటుంది. ఇటు నుంచి చూస్తే నువ్వే జైలుపాలు అయినట్టు అనిపిస్తుంది దీప.. అంటాడు. నువ్వు మనుషులను బాగా అర్థం చేసుకున్నావు. ఏం జరిగినా.. అది నా తలరాత అని నీ మీదే వేసుకొని మనుషులను క్షమించేస్తావు అని అంటాడు.
వరదల్లో కొట్టుకుపోయేవాడు.. గడ్డి పోచ అయినా ఉతంగా దొరుకుతుందేమో అని ఆశపడతాడు. వరద ఉదృతిగా ఉంది దీప. నీకు గడ్డి పోచ కూడా దొరకదు.. అని డాక్టర్ బాబు అంటాడు. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు నాకు వైద్యం చేయించి బతికించారు. అప్పుడు మనం విడివిడిగానే ఉన్నాం. అప్పుడు నన్నెందుకు బతికించారు.. నాకు ఈ తాళి కట్టినందుకే కదా.. నేను ఎలాగైనా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా. భార్యగా అది నా ధర్మం.. అని అంటుంది దీప.
మిమ్మల్ని అమ్మ తీసుకెళ్లిందా? అక్కడే ఉండండి. మీకు ఏ లోటూ ఉండదు. వాళ్ల దగ్గర ఉంటే మీరు బాగుంటారు. వాళ్లు మిమ్మల్ని బాగా చూసుకుంటారు.. అని అంటాడు డాక్టర్ బాబు. మాకు మీరు లేని లోటును ఆ దేవుడు కూడా తీర్చలేడు డాక్టర్ బాబు. అలా నేను ఎప్పటికీ అనుకోను.
నాకు, నా బిడ్డలను ఎటువంటి కష్టం లేకుండా వేళకు ఇంత తిండి దొరుకుతుంది కదా.. భర్త ఎక్కడుంటేంది.. అని ఏ భార్యా అనుకోదు. అలా నేనెప్పటికీ అనుకోను.. అని దీప అనగానే.. దీప ఏమిచ్చాను నేను నీకు. నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీకు కష్టాలే. కష్టాలే ఎప్పుడూ నీకు ఇచ్చాను. ఇంకా నువ్వు నా కోసం ఏడుస్తున్నావా? కంటికి, మింటికి ఏకదారిగా ఏడిస్తే.. ఆ కన్నీటి శాపం తగిలే నేను ఇలా కటకటాల వెనుక మిగిలాను.. అని అంటాడు కార్తీక్.