Karthika Deepam 2 Today Episode : అసలైన వారసురాలంటూ దొరికిపోయిన పారు..జ్యో భయం, రౌడీల నుంచి తప్పించుకున్న దాసు..

Karthika Deepam 2 Today Episode : అసలైన వారసురాలంటూ దొరికిపోయిన పారు..జ్యో భయం, రౌడీల నుంచి తప్పించుకున్న దాసు..

 Authored By suma | The Telugu News | Updated on :22 January 2026,9:30 am

ప్రధానాంశాలు:

  •  Karthika Deepam 2 Today Episode : అసలైన వారసురాలంటూ దొరికిపోయిన పారు..జ్యో భయం, రౌడీల నుంచి తప్పించుకున్న దాసు..

Karthika Deepam 2 Today Episode:  కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 22 టుడే ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాలతో కట్టిపడేసింది. కాంచన ఇంటికి రాకపోవడంతో సుమిత్ర తీవ్రంగా కలత చెందుతుంది. “ఏ క్షణంలో ఏమైపోతుందో తెలియడం లేదు” అంటూ ఆమె భయంతో ఏడుస్తుంది. తాను కన్ను మూసే ముందు తన కూతురు తన కళ్ల ముందే ఉండాలని కోరుకుంటూ కార్తీక్‌ను ఆపుతుంది. జ్యోత్స్నను బయటకు వెళ్లకుండా కార్తీక్ అడ్డుకుంటాడు. సుమిత్ర భయాన్ని చూసిన కార్తీక్, దీప, శౌర్య అందరూ ఆమెకు ధైర్యం చెబుతారు. ఇదిలా ఉండగా శివ నారాయణ కాంచన కోసం ఎదురు చూస్తుంటాడు. అయితే ఇంటికి కార్తీక్, దీప, శౌర్య మాత్రమే రావడంతో ఆయన నిరాశ చెందుతాడు. నానమ్మ ఏదీ? అని అడిగితే నానమ్మ రావడం లేదని శౌర్య చెప్తుంది. వదిన ఎందుకు రాలేదని సుమిత్ర అడగగా అమ్మకు ధైర్యం చాలట్లేదని కార్తీక్ వివరిస్తాడు. ఈ మాటలు సుమిత్ర మనసును మరింత కలిచివేస్తాయి…

Karthika Deepam 2 January 22 2026 wednesday full episode

Karthika Deepam 2 January 22 2026 wednesday full episode

అసలైన వారసురాలు మాట..పారిజాతం నోరు జారిన క్షణం

ఈ ఎపిసోడ్‌లో కీలక మలుపు పారిజాతం మాటలతో వస్తుంది. జ్యోత్స్న పరిస్థితి బాగోలేదని అందుకే గదిలోనే ఉంటోందని పారు చెప్పే ప్రయత్నంలో అసలైన వారసురాలు అనే మాట నోరు జారుతుంది. ఈ మాట కార్తీక్‌కు పెద్ద షాక్ ఇస్తుంది. పారిజాతం, కార్తీక్ మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. నేను ఈ ఇంటి దేవతను అంటూ పారిజాతం అహంకారంగా మాట్లాడితే శివ నారాయణ అంటే నీ చుట్టూ తిరగాలా? నాకు ఏదీ కనిపించడం లేదు అంటూ వ్యంగ్యంగా స్పందిస్తాడు. కార్తీక్ మాత్రం పరిస్థితిని గమనిస్తూ భయం ఉంటేనే చెమటలు పడతాయి. కర్మ కాలితే రహస్యాలు బయటపడతాయి అంటూ అర్థవంతమైన మాటలు అంటాడు. ఈ సంభాషణలు రాబోయే రోజుల్లో నిజాలు వెలుగులోకి వస్తాయనే సంకేతాలు ఇస్తాయి.

జ్యో నిర్ణయం..దాసు తప్పించుకోవడం

జ్యోత్స్న భయంతో ఇంటిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. రెండు రోజుల పాటు ఫ్రెండ్ దగ్గర ఉంటానని చెప్పి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో సుమిత్ర వచ్చి ఆమెను ఆపుతుంది. నా కూతురు నా కళ్ల ముందే ఉండాలి అంటూ ఆమె కార్తీక్‌ను వేడుకుంటుంది. కార్తీక్ కూడా జ్యో ఎక్కడికీ వెళ్లొద్దని స్పష్టంగా చెప్తాడు. రాబోయే మెడికల్ టెస్టు రిపోర్ట్స్ గురించిన భయం జ్యో మాటల్లో బయటపడుతుంది. డాక్టర్ ఎవరికీ ఫోన్ చేస్తుందో తెలియక టెన్షన్ పడుతుంది. మరోవైపు అసలైన వారసురాలన్న మాటతో పారు మరింత అప్రమత్తమవుతుంది. కార్తీక్‌ను ముందుగా ఇంటి నుంచి బయటకు పంపించాలనే ఆలోచనతో ఆమె అడుగులు వేస్తుంది. అదే సమయంలో రౌడీల నుంచి దాసు తెలివిగా తప్పించుకోవడం మరో ఉత్కంఠభరిత సన్నివేశంగా నిలుస్తుంది. మొత్తంగా జనవరి 22 ఎపిసోడ్‌లో భయం, భావోద్వేగాలు, రహస్యాలు అన్నీ కలసి కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. అసలైన వారసురాలు ఎవరు? జ్యోత్స్న ఆరోగ్య రిపోర్ట్స్ ఏం చెబుతాయి? పారు వేసే ప్లాన్‌లు ఎంతవరకు సఫలం అవుతాయి? అనే ప్రశ్నలతో ప్రేక్షకులను తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూడేలా చేసింది.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది