Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు కాంచన అమ్మవారి రక్ష.. దాసు ఎంట్రీ.. జ్యోత్స్న భయం.. సీసీ కెమెరాలో బట్టబయలు!

Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు కాంచన అమ్మవారి రక్ష.. దాసు ఎంట్రీ.. జ్యోత్స్న భయం.. సీసీ కెమెరాలో బట్టబయలు!

 Authored By suma | The Telugu News | Updated on :23 January 2026,9:00 am

Karthika Deepam 2 Today Episode: కాంచన – శ్రీధర్ సంభాషణతో మొదలైన భావోద్వేగ ఘట్టం

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్ ఆధ్యాత్మికత, భావోద్వేగాలు, ఉత్కంఠతో నిండిపోయింది. ఎపిసోడ్ ఆరంభంలో కాంచన అమ్మవారికి మొక్కుకుని తాళిని కళ్లకు అద్దుకుంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీధర్ నువ్వు తాళిని కళ్లకు అద్దుకున్నంత మాత్రాన నన్ను ఇష్టపడుతున్నావని నేను అనుకోను. ఆడదానికి తాళి అలంకరణ కాదు.. అది జీవితంలో ఒక భాగం అంటూ భావోద్వేగంగా మాట్లాడతాడు. నవ్వే కాలం కాదు.. ఇప్పుడు కన్నీటి కాలం నడుస్తోంది అని శ్రీధర్ చెప్పగా కాంచన చమురు ఉన్నంత వరకే దీపం వెలుగుతుంది. రెండు కదలవు కానీ వెలుగునిస్తాయి అంటూ సమాధానం ఇస్తుంది. అంతలోనే దీపం ఆరిపోవడంతో శ్రీధర్ మళ్లీ దీపాన్ని వెలిగిస్తాడు. నేను వచ్చింది వెలుగు నింపడానికే. మీ నాన్నగారి ఇంటికి వెళ్దాం. మీ అన్నయ్య నన్ను తీసుకురమ్మన్నాడు అంటూ కాంచనను తీసుకెళ్లేందుకు ఒప్పిస్తాడు.

Karthika Deepam 2 January 23 2026 Thursday full episode

Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు కాంచన అమ్మవారి రక్ష.. దాసు ఎంట్రీ.. జ్యోత్స్న భయం.. సీసీ కెమెరాలో బట్టబయలు!

Karthika Deepam 2 Today Episode: సుమిత్ర – దీప మధ్య అనుబంధం అమ్మవారి రక్ష

మరోవైపు కిచెన్‌లో సుమిత్ర, కార్తీక్‌కి తాటిబెల్లం పరమాన్నం అంటే చాలా ఇష్టమని దీపకు చెబుతుంది. ఆ మాటలతో దీప కన్నీళ్లతో నిండిపోతుంది. నేను చనిపోయే సమయంలో నా కూతురు నా దగ్గర ఉండాలి అని సుమిత్ర అన్న మాటలు దీపకు గుర్తుకొస్తాయి. అందుకే ఈ ఇంట్లోనే కొద్ది రోజులు ఉండాలని తన మనసు తెరిచి చెబుతుంది. నన్ను చూసుకోవడానికి నా కూతురు ఉందిగా అంటూ సుమిత్ర ఆప్యాయంగా స్పందిస్తుంది. ఇంతలో శౌర్య వచ్చి కాంచన, శ్రీధర్ వచ్చారని చెప్పడంతో అందరూ హాల్‌కి వెళ్తారు. సుమిత్రను చూసిన కాంచన ఎంతో ప్రేమగా పలకరిస్తుంది. అమ్మవారి రక్ష తీసుకొచ్చానని చెప్పి సుమిత్రకు కడుతుంది. నువ్వు దీర్ఘాయుష్మంతురాలిగా, దీర్ఘ సుమంగళిగా ఉండాలి అని ఆశీర్వదిస్తుంది. అదే సమయంలో జ్యోత్స్నతో ఇంట్లో అందరికంటే పెద్ద బాధ్యత నీదే అని ఉద్వేగా పూర్వకంగా అంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రిపోర్ట్స్ గురించి శ్రీధర్ మాట్లాడుతూ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రిపేర్ అవ్వండి అని చెప్పడంతో కుటుంబంలో ఆశ చిగురిస్తుంది.

Karthika Deepam 2 Today Episode: దాసు ఎంట్రీ.. జ్యోత్స్న భయం.. సీసీ కెమెరాలో బట్టబయలు!

ఇంతలో జ్యోత్స్నకు ఓ కాల్ రావడంతో పక్కకు వెళ్లుతుంది. రౌడీలు ఫోన్ చేసి మీ నాన్నగారు తప్పించుకున్నారు అని చెప్పడంతో జ్యోత్స్న కంగారు పడుతుంది. అదే సమయంలో గేట్ దగ్గరికి దాసు రావడం ఆమె చూసి షాక్ అవుతుంది. నిజం చెప్పడానికి వచ్చాడని తెలుసు.. ఎలాగైనా తప్పించాలి అని నిర్ణయించుకుంటుంది. దాసు లోపలికి వచ్చి కింద పడిపోతాడు. పారిజాతం అతన్ని చూసి గుర్తుపడుతుంది. ఆ గందరగోళంలో జ్యోత్స్న రౌడీల సహాయంతో దాసును బయటకు తీసుకెళ్లిస్తుంది. కొద్దిసేపటికి అందరూ బయటకు వచ్చేసరికి దాసు కనిపించడు. దాసు వచ్చాడురా అని పారిజాతం ఒట్టు పెట్టి చెబుతుంటే జ్యోత్స్న మాత్రం నాకు కనిపించలేదు నేను చూడలేదు అంటూ తప్పించుకుంటుంది. అయితే కార్తీక్ కీలకమైన మాట అంటాడు. మన ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయిగా.. అవే నిజం చెబుతాయి అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. దాసును రౌడీలు తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డ్ అయ్యుంటాయి అన్న మాటతో జ్యోత్స్న భయంతో వణికిపోతుంది. నిజం బయటపడే క్షణం దగ్గరపడిందన్న ఉత్కంఠతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది