Karthika Deepam Today Episode : హిమను చంపించినట్టే.. నిన్ను కూడా చంపేస్తా.. అంజిని తుపాకీతో బెదిరించిన మోనిత.. ఈ విషయం తెలిసి షాక్ అయిన దీప

Karthika Deepam Today Episode : కార్తీక దీపం 4 ఆగస్టు 2021 బుధవారం ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. 1109 కార్తీక దీపం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీప ఆ కారులో ఉందన్న విషయం తెలియకుండా మోనిత కూడా అదే కారును లిఫ్ట్ అడిగి సూర్యాపేట వెళ్తుంటుంది. మోనితకు కనిపించకుండా.. దుప్పటి కప్పుకొని దీప పడుకున్నట్టు నటిస్తుంది. మోనిత ఎవరెవరికి కాల్ చేస్తుందో గమనిస్తుంది. ఇక సూర్యాపేట ఇంకో 4 కిలోమీటర్లలో వస్తుందనగా.. మోనిత ద్రాక్షారామం అనే వ్యక్తికి ఫోన్ చేస్తుంది. నేను సూర్యాపేట దగ్గరికి వచ్చేశాను.. అంటూ అతడికి చెబుతుంది. సూర్యాపేటలోని 8 రెస్టారెంట్ నుంచి వరంగల్ హైవే దగ్గర ఉన్న యాదగరిగుట్ట ఫామ్ హౌస్ కు కారు బుక్ చేయి.. అని చెబుతుంది.

Karthika deepam 4 august 2021 episode 1109 highlights

వామ్మో.. ఇలా అయితే కష్టం.. ఇక మోనితకు షాక్ ఇవ్వాల్సిందే అని అనుకొని వెంటనే కారులో లైట్ వేసి మోనిత బాగున్నావా? అని అనగానే.. వెంటనే మోనిత.. దీపను కారులో చూసి షాక్ అవుతుంది. అయ్యో.. అక్క నువ్వేనా. ఒక్క నిమిషం కారు ఆపు అంటూ వెనక్కి వెళ్లి కూర్చొని.. ఏంటి దీప.. విషయాలు అంటూ చాలా కూల్ గా మాట్లాడుతోంది.

Karthika Deepam Today Episode : దీప కోసం టెన్షన్ పడుతున్న డాక్టర్ బాబు

దీప ఎక్కడికి వెళ్లిందో తెలియక ఓవైపు డాక్టర్ బాబు తెగ టెన్షన్ పడుతుంటాడు. దీప గురించి కారులో తన తమ్ముడితో కలిసి వెతుకుతుంటాడు. మోనితకు కాల్ చేసినా ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెబుతుంది. దీంతో ఏం చేయాలో కార్తీక్ కు అర్థం కాదు. అసలు.. దీప ఎక్కడికి వెళ్లిందో తెలియక.. మరోవైపు మోనిత కూడా ఇంట్లో లేదు అని తెలుసుకొని వాళ్లిద్దరి కోసం వెతుకుతుంటాడు కార్తీక్.

Karthika deepam 4 august 2021 episode 1109 highlights

మరోవైపు వెంకటేశ్.. కారును పక్కకు ఆపి టీ తాగడానికి వెళ్తాడు. ఇంతలో దీప, మోనిత.. ఇద్దరూ కారు దిగి బయట నిలబడతారు. వెంకటేశ్ టీ తాగి వచ్చే లోపు కాస్త ఓపెన్ గా మాట్లాడుకుందామా? అని మోనిత.. దీపతో అంటుంది. అప్పుడు దీప.. లేదు చాలా క్లోజ్ గా మాట్లాడుకుందాం.. అని అంటుంది. చెప్పు అని అంటుంది. దీంతో నువ్వు నా పెళ్లి పెటాకులు చేస్తా అన్నావు కానీ.. నేను మాత్రం నా పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను. పైగా ఈ హైవేలో ధైర్యంగా నీ పక్కన కూర్చొని ప్రయాణం చేస్తున్నా. ఇదంతా చూసి నువ్వు ఆశ్చర్యపోతున్నావా? అంటూ.. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని దీపను అడుగుతుంది మోనిత. దీంతో దుర్గ దగ్గరికి అని చెబుతుంది దీప. దుర్గను తీసుకొని వచ్చి నాపెళ్లి ఆపేస్తుందా? అని షాక్ అవుతుంది మోనిత. దుర్గ విజయవాడలోనే కదా ఉండేది. నువ్వు ఆ దుర్గ అనుకున్నావా? కాదు కాదు.. నేను వెళ్లేది విజయవాడ దుర్గమ్మ టెంపుల్ కు. చికాకుగా ఉంది కదా.. అందుకే వెళ్తున్నా గుడికి అని దీప అబద్ధం చెబుతుంది.

Karthika deepam 4 august 2021 episode 1109 highlights

అయితే.. మరి నువ్వు ఎందుకు సూర్యాపేట హోటల్ 8 కు వెళ్తున్నావు. అని అడగగానే.. రేపు నా పెళ్లి కదా అక్క. నువ్వు వెళ్లి వచ్చేసరికి నా పెళ్లి అయిపోతుంది. రేపే రిసెప్షన్ కదా. ఆ హోటల్ లో వంట బాగా చేస్తారట. వాళ్లను తీసుకెళ్దామని వెళ్తున్నా.. అని చెబుతుంది దీప. దీపకు ఉన్న కాన్ఫిడెన్స్ చూసి మోనిత షాక్ అవుతుంది. రేపు ఉదయం అంటే 25 వ తేదీ 11.30 కు ఏం జరుగుతుందో నువ్వే చూడవే.. నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి కాకపోతే నాపేరు దీపే కాదు.. అంటూ మోనితకు సవాల్ విసురుతుంది దీప. దీంతో మోనిత మరోసారి షాక్ అవుతుంది.

Karthika deepam 4 august 2021 episode 1109 highlights

ఇక.. దీప కోసం వెతికి వెతికి.. ఇక లాభం లేదనుకొని వెంటనే ఇంటికి తిరిగి వచ్చేస్తాడు కార్తీక్. తన జీవితం ఇలా అయిపోయిందేంటని చాలా బాధపడతాడు కార్తీక్. కట్ చేస్తే.. కారు సూర్యాపేటలోని 8 రెస్టారెంట్ కు వస్తుంది. మోనిత దిగి.. దీపకు థాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది. దీంతో మోనిత.. తిన్నగా అంజి ఉన్న రూమ్ లోకి దగ్గరికి వెళ్లి అంజి డోర్ కొడుతుంది. అంజి తలుపు తీయగానే.. వెంటనే అంజి కాళ్ల మీద పడిపోతుంది.

Karthika deepam 4 august 2021 episode 1109 highlights

రేపు 25 వ తేదీన నా పెళ్లి. నేను చాలా తప్పులు చేశాను అంజి. నన్ను క్షమించు అంజి. నిన్ను నా పెళ్లికి తీసుకుబోవడానికి వచ్చా.. అని చెబుతుంది అంజి. అవునా.. నీకు పెళ్లా. నీ చావు కోసం ఎదురు చూస్తున్నా నేను.. అంటూ అంజి సీరియస్ అవుతాడు. అసలు నిన్ను పెళ్లి చేసుకునేది ఎవరు.. అనేసరికి.. నన్ను పెళ్లి చేసుకునేది డాక్టర్ బాబు కాదు వేరే వ్యక్తి అంటూ చెబుతుంది మోనిత.

Karthika deepam 4 august 2021 episode 1109 highlights

మోనిత.. ఎన్ని అబద్ధాలు చెప్పినా అంజి మాత్రం అస్సలు నమ్మడు. నా పెళ్లి పెద్దలు.. డాక్టర్ బాబు, దీప.. అని చెప్పినా కూడా అంజి నమ్మడు. మళ్లీ ఏం స్కెచ్ వేసి వచ్చావు చెప్పు. అసలు నీకు ఏం కావాలి. నా దగ్గరికి ఎందుకు వచ్చావు. నువ్వు అల్లే కథలు వినే ఓపిక నాకు లేదు. నువ్వు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావంటే.. ఏదో పెద్ద ప్లానే వేశావు. నువ్వు డాక్టర్ బాబును వదిలేశావు.. అంటే నేను నమ్ముతానా?

దీపమ్మకు ఏమైనా ఆపద తలపెట్టావో అస్సలు బాగుండదు. అనగానే మోనిత.. అంజిపై సీరియస్ అవుతుంది. ఏముందిరా దీప దగ్గర.. అంటుంది. ఇదంతా గది బయట ఉండి.. సెల్ లో రికార్డు చేస్తుంది దీప. నువ్వు మాట వినకపోతే.. నిన్ను చంపేస్తా అంటూ తుపాకీతో బెదిరిస్తుంది మోనిత. హిమను నేను ఎలా చంపించానో.. నిన్ను కూడా అలాగే చంపిస్తాం.. అంటూ అంజిని బెదిరిస్తుంది. ఈ విషయం విని.. దీప షాక్ కు గురవుతుంది.

Karthika deepam 4 august 2021 episode 1109 highlights

ఇది కూడా చ‌ద‌వండి ==> పాముతో స‌ర‌దాగా ఆడుకుందాం అనుకున్నాడు.. పాము అత‌ని లుంగీలోకి దూరి ఏం చేసిందో చూడండి ?

ఇది కూడా చ‌ద‌వండి ==> అందాల దాడి చేస్తోన్న ఇస్మార్ట్ పోరీ.. చీరలో నభా పరువాల విందు!

ఇది కూడా చ‌ద‌వండి ==> తన ఎక్స్‌ను చూపించిన రష్మి.. అందరికీ షాక్ ఇచ్చిన యాంకర్.. వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> అమ్మాయిలతో అఫైర్స్.. నిర్మాత సురేశ్ బాబు షాకింగ్ కామెంట్స్..?

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

2 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

4 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

8 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

11 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

14 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago