Suresh Babu : అమ్మాయిలతో అఫైర్స్.. నిర్మాత సురేశ్ బాబు షాకింగ్ కామెంట్స్..?
Suresh Babu : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు తెలుసు కదా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న పాపులారిటీనే వేరు. ఎన్నో పెద్ద పెద్ద సినిమాలను నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన తండ్రి రామానాయుడును మూవీ మొఘల్ అని పిలుస్తుంటారు. సురేశ్ ప్రొడక్షన్స్ పేరుతో వాళ్లు చాలా గొప్ప సినిమాలను నిర్మించారు. తన తమ్ముడు వెంకటేశ్ స్టార్ హీరోగా సెటిల్ అవ్వగా… సురేశ్ బాబు మాత్రం నిర్మాతగా కొనసాగుతూ వస్తున్నారు.

tollywood producer suresh babu about his affaris with girls
ఇటీవలే.. వెంకటేశ్ హీరోగా నటించిన నారప్ప సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అంత భారీ బడ్జెట్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం అంటే అది ఒక సాహసం అనే చెప్పారు. ఇలా ఓటీటీలో రిలీజ్ చేసి తెలుగు సినిమాను దిగజార్చుతున్నారంటూ సురేశ్ బాబుపై విమర్శలు కూడా వచ్చాయి. ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా.. నారప్పను ఓటీటీలో రిలీజ్ చేశారు.

tollywood producer suresh babu about his affaris with girls
Suresh Babu : అమ్మాయిలతో అఫైర్స్ గురించి ఇంటర్వ్యూలో చెప్పిన సురేశ్ బాబు
అమ్మాయిలతో అఫైర్స్ గురించి సురేశ్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మద్యం అలవాటు గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. తనకు చిన్నప్పటి నుంచి జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉండేదట. నాకు నటన వైపు వెళ్లే అవకాశాలు ఉన్నా.. నాకు అటువైపు వెళ్లడం ఇష్టం లేక.. నిర్మాతగా మారా. నాకు నిర్మాణ పనులు చూసుకోవడం అంటేనే ఇష్టం. మా బాబాయిని చూసి.. జీవితంలో మందు ముట్టుకోకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే.. మా బాబాయి.. మందుకు బానిస అయి… తన జీవితంతో పాటు.. మా పిన్ని జీవితాన్ని కూడా నాశనం చేశాడు.
అందుకే అటువంటి వాటికి దూరం. అలాగే.. నాకు అఫైర్స్ ఫెట్టుకునే అవకాశాలు ఉన్నా కూడా ఎవరితో అఫైర్స్ పెట్టుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో అలా చేయొచ్చు కానీ.. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. పెళ్లి చేసుకున్న భార్యకు అన్యాయం చేయకూడదని అనుకున్నా. అందుకే.. అఫైర్స్ పెట్టుకోలేదు. ఒకవేళ మనకు వచ్చే భార్య వేరే వాళ్లతో అఫైర్స్ పెట్టుకుంటే మనం ఊరుకుంటామా? అందుకే.. నా ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో ఇప్పటి వరకు ఎక్కడా నేను అటువంటి పని చేసింది లేదు.. అంటూ సురేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి ==> పవన్ కళ్యాణ్ చేసిన ఆ పని చేసి.. శెభాష్ అనిపించుకున్న అకీరా నందన్.. వీడియో
ఇది కూడా చదవండి ==> యువతిని అడ్రస్ అడుగుతూ అక్కడ నొక్కాడు.. ఆకతాయికి సరైన బుద్ధి చెప్పిన యువతి.. వీడియో
ఇది కూడా చదవండి ==> బుల్లితెరకు పూర్తిగా గుడ్ డై.. యాంకర్ వర్షిణి పని ఖతం!!
ఇది కూడా చదవండి ==> దీప ఉందని తెలియక దీప కారునే లిఫ్ట్ అడిగి ఎక్కిన మోనిత.. ఇద్దరూ ఒకే కారులో సూర్యాపేటకు.. వాట్ ఏ ట్విస్ట్