Karthika Deepam : జులై 26, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్.. విషం కలిపిన నీళ్లను తాగిన దీప..!
Karthika Deepam : సోమవారం, జులై 26న ప్రసారమయ్యే కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. కార్తీక దీపం సోమవారం ఎపిసోడ్ 1101 హైలైట్స్ చూస్తే.. మోనిత.. కార్తీక, దీపను బెదిరిస్తుంది. మీరు నన్ను ఇలాగే ఇబ్బంది పెడితే.. నేను విషం కలిపిన నీళ్లను తాగేస్తా.. అంటూ ఓ బాటిల్ చూపిస్తూ బెదిరిస్తుంది. నన్ను ఇక నుంచి మీరు ఏం అనకూడదు. ఏమన్నా కూడా నేను బతకను. ఆ నింద మీమీదనే పడుతుంది.. అంటూ కార్తీక్ ను బెదిరించబోయింది మోనిత.
karthika deepam monday episode highlights
అయితే.. మోనిత పన్నాగాన్ని పసిగట్టిన దీప.. తాగవే.. తాగి చావు.. భయపెట్టడం కాదు.. నీకు దమ్ముంటే ఇప్పుడే వెంటనే ఆ విషం కలిపిన నీళ్లను తాగు.. అంటూ మోనితను బెదిరిస్తుంది మోనిత. దీంతో మోనిత షాక్ కు గురవుతుంది. అందరూ తనను విషం కలిపిన నీళ్లు తాగొద్దని బతిమిలాడుతారని అనుకున్న మోనితకు బిగ్ షాక్ తగిలింది. దీంతో ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది మోనిత.
karthika deepam monday episode highlights
Karthika Deepam : నువ్వు తాగకపోతే నేనే తాగి చచ్చిపోతా అనేసిన దీప
నువ్వు నీళ్లు తాగకపోతే చెప్పు.. నేను తాగి చచ్చిపోతా.. అంటూ బెదరిస్తుంది దీప. అయినా కూడా మోనిత ఏం మాట్లాడకపోయేసరికి.. వెంటనే విషం కలిపిన నీళ్ల బాటిల్ ను తీసుకున్న దీప.. నీళ్ల బాటిల్ ను ఓపెన్ చేసి వెంటనే తాగేస్తుంది. తను ఇలా చేస్తుందని ఊహించని కార్తీక్ షాక్ కు గురవుతాడు. అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు. దీప.. వద్దు వద్దు అని అంటున్నా కూడా వినకుండా.. దీప ఆ నీళ్లను తాగుతుంటే.. మోనిత మాత్రం ఎంతో సంతోషానికి గురవుతుంది.
karthika deepam monday episode highlights
మరి.. దీపకు ఏమైనా అవుతుందా? విషం నీళ్లు తాగడం వల్ల తనకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? అసలు.. ఏం జరిగింది. నిజంగానే ఆ బాటిల్ లో విషం కలిపిన నీళ్లు ఉన్నాయా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సోమవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.