Karthika Deepam Today Episode : వంటలక్క నిజస్వరూపం ఇదా..? అంత షాక్ !
Karthika Deepam Today Episode : ఈరోజు కార్తీకదీపం ఎపిసోడ్ (Karthika Deepam Today Episode) పూర్తి మోతాదులో ట్విస్ట్‌లతో నిండి ఉంది. గౌతమ్ మంచోడు కాదన్న నిజాన్ని బయట పెట్టడానికి కాంచన శివన్నారాయణను ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను ఆమెను తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతకీ సుమిత్ర కూడా కాంచన్ మాటలను నమ్మదు. మళ్లీ అదే భరోసా – ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందంటూ ఆమెను అవమానంగా పంపిస్తుంది. మరోవైపు కావేరిని వెతికే ప్రయత్నంలో ఉన్న శ్రీధర్, ఆమె ఇంట్లోనే ఉండడం చూసి కోపంతో తిడతాడు. కావేరి కూడా అతనికి చురకలేస్తూ సమాధానం ఇస్తుంది.
ఇక పుట్టింట్లో ఎదురైన అవమానాన్ని గురించి దీపకు వివరించి తన బాధను పంచుకుంటుంది కాంచన. జ్యోత్స్న మంచిది కాదని, ఆమె ప్లాన్లు దీప జీవితాన్ని నాశనం చేయాలన్న కోణంలోనే ఉన్నాయని హెచ్చరిస్తుంది. దీపను నిందల నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం చేయమని చెప్పి వెళ్లిపోతుంది. అనసూయ కూడా దీపకు ధైర్యం చెబుతూ, నువ్వు వదలకూడదు, కానీ తెలివిగా ఉండి నిందలు దూరంగా పెట్టుకోమంటూ శక్తినివ్వడం ఒక ఎమోషనల్ మోమెంట్‌గా నిలిచింది. ఇక వంటలక్క అయితే ఓ రేంజ్‌లో రెచ్చిపోయి బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఎంట్రీ ఇచ్చింది.

Karthika Deepam Today Episode : వంటలక్క నిజస్వరూపం ఇదా..? అంత షాక్ !
ఇంతలో పారిజాతం జ్యోత్స్న దగ్గరకు వెళ్లి కాంచన చేసిన ప్రయత్నాలను వివరించడంతో, జ్యోత్స్న షాక్ అవుతుంది. దీపకు తన రహస్యాలు తెలిసిపోయాయని తెలుసుకున్న జ్యోత్స్న పారిజాతపై చిందేసి.. చివరకు దీపను ఆపాలని ఫోన్ చేస్తుంది. కానీ దీప ఏమాత్రం వెనకడుగు వేయకుండా, నీవల్ల నా పెళ్లి ఆగదని, నీ ఆటలు సాగవని తేల్చి చెబుతుంది. చివర్లో కార్తీక్ ఇంటికి వచ్చి దీప ఎక్కడ అన్నపుడు, కాంచన-అనసూయ ఇద్దరూ మౌనం వహిస్తారు. శివన్నారాయణ ఎక్స్‌పోజ్ అయిన విషయాలు తెలియడంతో, కార్తీక్ ఫైర్ అవుతూ , మీకు నేను లెక్కలో లేనట్టే అని తీవ్రంగా స్పందిస్తాడు. దీంతో ఎపిసోడ్ ఎమోషన్, ఉత్కంఠతో ముగుస్తుంది.