Kavitha Key comments on Harish Rao
Kavitha Key Comments on Harish Rao : బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. హరీశ్‌రావు ట్రబుల్ షూటర్ కాదని, బబుల్ షూటర్ అని ఎద్దేవా చేశారు. ఆయనే సమస్యలు సృష్టించి, తర్వాత వాటిని పరిష్కరించినట్లు నటిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం అంశంలో రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’ జరిగిందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌కు తాను ఎప్పటికీ హాని కలిగించనని స్పష్టం చేశారు.
Kavitha Key comments on Harish Rao
హరీశ్‌రావు, సంతోష్‌రావులు కలిసి బీఆర్ఎస్ పార్టీని అస్తవ్యస్తం చేయాలని కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. వీరి చర్యల వల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటల రాజేందర్ లాంటి నేతలు పార్టీని వీడాల్సి వచ్చిందని కవిత ఆరోపించారు. ఉప ఎన్నికల్లో ఈటల విజయంలో కూడా హరీశ్‌రావు కీలక పాత్ర పోషించారని విమర్శించారు. అంతేకాకుండా కేటీఆర్‌ను ఓడించేందుకు ప్రతిపక్షాలకు నిధులు పంపిన వారే హరీశ్‌రావు అని కవిత ఆరోపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇకపోతే, తాను పదవుల కోసం కాకుండా, కేసీఆర్ కుటుంబ గౌరవం కోసం మాత్రమే పోరాడుతున్నానని కవిత తెలిపారు. తనపై ఎన్నో కుట్రలు, అవమానాలు జరిగినా, కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వనని స్పష్టం చేశారు. హరీశ్‌రావును పార్టీ లోపల “నక్కజిత్తు”లా వ్యవహరించేవారని, కేటీఆర్‌ను మభ్యపెడుతూ తప్పుదారులు పట్టిస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి, కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లోని అంతర్గత విభేదాలను బహిర్గతం చేస్తూ, పార్టీ భవిష్యత్తుపై మరింత అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
Phone Tapping : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు…
మీరు ₹15,000 లోపు బడ్జెట్‌తో శక్తివంతమైన 5జీ స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? రియల్మీ ఫోన్లంటే మీకు ప్రత్యేకమైన ఇష్టమా?…
Pawan- Balayya | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ మాటకు తిరుగు…
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనాలు దారుణంగా నియమాలను అతిక్రమిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి..ఈ వాహనాలు…
K Kavitha Resigns From The BRS & MLC : భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ నుంచి…
Samantha-Raj | టాలీవుడ్ నటి సమంత మరియు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరు మధ్య బంధం రోజు రోజుకి మరింత…
Zomato | ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనగానే ప్రజలకు ముందుగా గుర్తొచ్చే పేర్లు జొమాటో, స్విగ్గీ. ప్రత్యేకించి పండుగల సీజన్…
Cucumber | హెల్తీ ఫుడ్స్ విషయంలో మనం తరచూ పండ్లు, కూరగాయలపై దృష్టి పెడతాం. అటువంటి వాటిలో కీర దోసకాయ…
This website uses cookies.