KCR Suspends Kavitha from BRS : బిఆర్ఎస్ నుండి కవిత అవుట్..కేసీఆర్ కీలక నిర్ణయం
KCR suspends daughter K Kavitha from BRS : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి. రవీందర్ రావు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను, పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కవిత ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ సస్పెన్షన్ నిర్ణయంతో పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి.

#image_title
కవిత సస్పెన్షన్ కు గల కారణాలను పార్టీ తన ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఆమె ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధిష్టానం అభిప్రాయపడింది. పార్టీ అధినేత కేసీఆర్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, ఆమెను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. గతంలో ‘కేసీఆర్ వెంట దెయ్యాలు ఉన్నారని’, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా బహిరంగంగా విమర్శలు చేయడం వంటి చర్యలు పార్టీలో చర్చకు దారితీశాయి.
తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్‌పై స్పందిస్తూ, మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులపై ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. ఈ నేపథ్యంలో కవితను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. భవిష్యత్తులో కవిత రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.