KCR : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం సొంత స్థలం ఉన్నవారికి మూడు లక్షలు..!!
KCR : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వరాల జల్లు కురిపిస్తుంది. ఒకపక్క రైతుబంధు కార్యక్రమాలతో తెలంగాణ రైతులకు డబ్బులు పంపిణీలు చేస్తూ ఉంది. మరోపక్క నిరుద్యోగులకు భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ తర్వాత సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి మూడు లక్షల ఆర్థిక సాయం అందించడానికి రెడీ అవుతున్నట్లు మంత్రి హరీష్ రావు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సిద్దిపేటలో బస్తీ దావకానాను ప్రారంభించి.. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. బస్తీ ప్రజలకు మరింత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ దావకాన ప్రారంభించినట్లు మంత్రి హరీష్ రావు తెలియజేయడం జరిగింది. ఈ ఏడాదిలోనే తెలంగాణ రాష్ట్రంలో
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ.. ఆ తరహాలోనే డబ్బులు పంపిన కార్యక్రమం సకాలంలో అందేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ఒకపక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమ కార్యక్రమాలతో కేసీఆర్ ప్రభుత్వం దూసుకుపోతుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాలకు విస్తరించేలా వ్యవహరిస్తూ ఉన్నారు.