KCR : కేసీఆర్ సర్కార్ నిర్ణయం… పేదలకు ఉచితంగా 125 గజాల భూముల క్రమబద్ధీకరణ..!
KCR : తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం పేదల పట్ల ఒక నిర్ణయాన్ని తీసుకోంది.అది ఏమనగా భూముల క్రమబద్ధీకరణకు ఈరోజు అనగా సోమవారం నుండి దరఖాస్తులను స్వీకరించనున్నారు. గతంలో కూడా భూముల క్రమబద్ధీకరణ చేసిన విషయం అందరికీ తెలిసిందే.అందుకని భూముల క్రమబద్ధీకరణకు ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలోని మీసేవ కేంద్రాలను సంప్రదించాలని కోరుతున్నారు. ఈ మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చేనెల 21 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.కావున ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని గురించి తెలుసుకుని భూముల క్రమబద్ధీకరణకు ఏ పత్రాలు ఉండాలో
ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో మీ దగ్గర లోని మీసేవ కేంద్రాల్లో సంప్రదించి తెలుసుకోండి.తెలంగాణ ప్రభుత్వం ఏ కుటుంబం అయితే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటుందో అలాంటి కుటుంబాలకు ఉచితంగా 125 గజాల భూమిని క్రమబద్ధీకరణ చేసేందుకు అనుమతినిచ్చారు కేసీఆర్ సర్కార్. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన చోట భూముల క్రమబద్ధీకరణకు సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు అని తెలిపారు.2014 జూన్ 2కి ఎవరైతే భూముల్లో ఆక్రమణదారులు పాల్పడి ఆ భూముల్లో నివాసంలో ఉన్నట్లయితే వాటిని నిర్ధారించే ఆధారాలతో మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని ఈనెల 14న రెవెన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే.
KCR : 2014లోనే తెలంగాణాలో భూముల క్రమబద్దీకరణ ప్రక్రియ!
జీవో ఎంఎస్ 14 ను అనుసరించి సోమవారం నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భూముల క్రమబద్దీకరణ ప్రక్రియకు 2014 డిసెంబర్ 30న జారీ చేసినటువంటి ఎంఎస్ 58, 59 ప్రకారం నిబంధనలు కూడా ఈసారి వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. కావున ప్రతి ఒక్కరూ వారి 125 గజాల భూమిని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఇదే మంచి సమయం. ప్రభుత్వం ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవడం చాలా మంచిది.