Rythu Bandhu : డిసెంబర్ 28 నుండి రైతుల ఎకౌంటు లో డబ్బులు..గుడ్ న్యూస్ తెలియజేసిన కేసీఆర్ ప్రభుత్వం..!!
Rythu Bandhu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒకపక్క వ్యవసాయానికి మరోపక్క పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహాలు అందిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ క్రమంలో తాజాగా రైతులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. విషయంలోకి వెళ్తే యాసంగి పంటకు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయనున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.
ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ దగ్గర పడుతూ ఉండటంతో రైతుబంధు నిధులు ఎప్పటిలాగా ఒక ఎకరం నుంచి ప్రారంభమైన రైతులందరి ఖాతాలో… సంక్రాంతి కల్లా జమ చేయనున్నారు. ఇందుకోసం గాను ₹7600 కోట్లను రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధమయింది. తెలంగాణలో ఇప్పటికే యాసంగి సీజన్ ప్రారంభమైంది. పల్లెలలో సాగు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పదో విడత రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న రైతులకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన
ప్రకటనతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదట తక్కువ భూమి ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్న వారి రైతుల ఎకౌంటులలో రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. కేసీఆర్ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుండి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ వుంది. ఈ క్రమంలో ప్రతి ఏడాది రెండు సీజన్ ల చొప్పున ఇప్పటివరకు 9 సీజన్ లలో రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించడం జరిగింది. వానాకాలం ఇంకా యాసంగి సీజన్ లలో ఎకరానికి 5000 చొప్పున మొత్తం పదివేల రూపాయలు ఇస్తున్నారు.