KCR Govt : త్వరలో కూలనున్న కేసీఆర్ ప్రభుత్వం? ఇదిగో సాక్ష్యం? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR Govt : త్వరలో కూలనున్న కేసీఆర్ ప్రభుత్వం? ఇదిగో సాక్ష్యం?

 Authored By jagadesh | The Telugu News | Updated on :10 March 2021,12:00 pm

KCR Govt : తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు.. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 14న జరగనున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ పట్టభద్రులను వేడుకుంటున్నాయి.

ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ఒక సవాల్ గా తీసుకున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అయితే.. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది. బీజేపీ కూడా అంతే దూకుడుతో ఉంది. మరోసారి అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించి.. పార్టీ పరువును గంగలో కలపాలని తెగ ప్రయత్నిస్తోంది.

kcr government to be collapsed after mlc elections

kcr government to be collapsed after mlc elections

అందుకే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బీజేపీ నేతలు టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వరంగల్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశంలో.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

KCR Govt : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే కూలనున్న కేసీఆర్ సర్కారు

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో కేసీఆర్ భవితవ్యం తేలిపోతుందని.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే.. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని.. కేసీఆర్ కు ముందే తెలుసని.. ఆ విషయం తెలిసి.. కేసీఆర్ గజగజా వణికిపోతున్నారని.. అందుకే.. ఉద్యోగ సంఘాలకు పిలిచి మరీ పీఆర్సీ ఇస్తా.. అంటూ నమ్మబలికారంటూ బండి సంజయ్ ఆరోపించారు.

1 తేదీ వస్తే.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం.. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తుందంటే నమ్మాలా? ప్రభుత్వం ఖజానా ఖాళీ అయింది. 7.5 శాతం కంటే ఎక్కువ ఫిట్ మెంట్ ను ప్రభుత్వం ఇవ్వలేదని.. బిస్వాల్ కమిటీయే తేల్చి చెప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం.. పీఆర్సీ ఇస్తామంటూ.. కేసీఆర్ ఉద్యోగులను నమ్మబలుకుతున్నారని.. బండి సంజయ్ ఆరోపించారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది