KCR : గెలవాలంటే నిలబడాలి.! కేసీఆర్ పవర్ చూపించాల్సిందే.!
KCR : దిశ ఘటనలో ఎలాంటి ఎన్‌కౌంటర్ అయితే జరిగిందో, అలాంటి ఎన్‌కౌంటర్ ఇప్పుడు కూడా జరగాలనే డిమాండ్లు పెరుగుతున్నాయ్.! విశ్వనగరం హైద్రాబాద్‌లో ఓ మైనర్ బాలిక మీద కొందరు యువకులు అత్యాచారం చేయడమేంటి.? కారులో కిడ్నాప్ చేసి, అదే కారులో అత్యాచారం చేయడం, ఆ కారు ఆచూకీ తెలియకపోవడం, ఘటన జరిగాక కూడా అది వెలుగులోకి రావడానికి సమయం పట్టడం.. ఇవన్నీ కేసీయార్ సర్కారు మీద చెరిపేసుకోలేని మచ్చని వేసేశాయి.
ముమ్మాటికీ దిశ ఘటనలో జరిగినట్లే ఎన్‌కౌంటర్ జరిగి తీరాలన్న డిమాండ్ పుట్టుకొస్తున్న దరిమిలా, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇప్పుడెలా స్పందిస్తారు.? గులాబీ పార్టీ నేతలు ఒకరొకరుగా స్పందిస్తున్నాగానీ, ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీయార్ ఇప్పటికే ఈ ఘటనపై స్పందించారు.. దోషుల్ని ఉపేక్షించేది లేదని తేల్చి పారేశారు. కానీ, అదీ సరిపోదు. స్వాయానా ముఖ్యమంత్రి ఈ ఘటనపై స్పందించడమే కాదు, యాక్షన్ చాలా చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రజలకు, అందునా హైద్రాబాదీలకు నమ్మకం కలిగేలా చేయాలి.

KCR Has To Show His Power This Time
మొన్నామధ్య ఓ పబ్‌లో డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసింది. ఓ సినీ నటి సహా పలువురు ప్రముఖులు ఆ ఘటనలో పోలీసులకు చిక్కారు. అయితే, ఆ ఘటన తాలూకు తీవ్రత ఆ తర్వాత బాగా తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ గ్యాంగ్ రేప్ ఘటనకు కూడా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ ఓ పబ్ కావడం గమనార్హం. పబ్బులో పార్టీ అనంతరం, కుర్రాళ్ళు తిరిగి వెళుతూ, మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి, కారులో ఎత్తుకెళ్ళారు. అంటే, పబ్బుల వల్ల వ్యవస్థ భ్రష్టు పట్టిపోతోందనే కదా అర్థం.? అధికార పార్టీకి చెందిన నాయకుల పిల్లలు ఈ కేసులో నిందితులుగా వున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు నాయకులపై పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకుంటారో గులాబీ బాస్ కేసీయార్ చెప్పాల్సిందే.