KCR : నాడు కేసీఆర్ పక్కన పెట్టిన‌ ఆ ముగ్గురు నేత‌లు.. నేడు మంత్రులు అయ్యారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : నాడు కేసీఆర్ పక్కన పెట్టిన‌ ఆ ముగ్గురు నేత‌లు.. నేడు మంత్రులు అయ్యారు..!

KCR  : కాలం కలిసి వస్తే అదృష్టం వరిస్తుందనేందుకు ఈ ముగ్గురే నిదర్శనం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనుకున్న ఆ ముగ్గురు నేతలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తమను కేసీఆర్ పక్కన పెట్టాడని సహించలేక ఎన్నికలకు కొంతకాలం ముందు కాంగ్రెస్ లోకి ఆ ముగ్గురు చేరారు. కాంగ్రెస్ ప్రజలు ఆదరణ చూపటంతో నేడు ఆ ముగ్గురు నేతలు మంత్రులు అయ్యారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆ ముగ్గురు నేతలు మంత్రులుగా […]

 Authored By anusha | The Telugu News | Updated on :8 December 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  KCR : నాడు కేసీఆర్ పక్కన పెట్టిన‌ ఆ ముగ్గురు నేత‌లు.. నేడు మంత్రులు అయ్యారు..!

KCR  : కాలం కలిసి వస్తే అదృష్టం వరిస్తుందనేందుకు ఈ ముగ్గురే నిదర్శనం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనుకున్న ఆ ముగ్గురు నేతలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. తమను కేసీఆర్ పక్కన పెట్టాడని సహించలేక ఎన్నికలకు కొంతకాలం ముందు కాంగ్రెస్ లోకి ఆ ముగ్గురు చేరారు. కాంగ్రెస్ ప్రజలు ఆదరణ చూపటంతో నేడు ఆ ముగ్గురు నేతలు మంత్రులు అయ్యారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆ ముగ్గురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన జూపల్లి కృష్ణారావు ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు.

బీఆర్ఎస్ నుంచి ఈ ముగ్గురు నేతలు టికెట్లు ఆశించారు. కానీ కెసిఆర్ ఇవ్వకపోవడంతో ముగ్గురు భంగపడ్డారు. ముఖ్యంగా పాలేరు, కొల్లాపూర్ లో కాంగ్రెస్ తరపున గెలుపొంది ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారు. దీన్ని అక్కడ టికెట్లు ఆశించిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌ రావు, జూపల్లి జూప‌ల్లి కృష్ణారావు  జీర్ణించుకోలేకపోయారు. పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి  కూడా ఇదే బాధ. ప్రజల్లో ఆదరణ తగ్గింది అనే కారణంతో కేసీఆర్ వారిని పక్కన పెట్టారు. కేసీఆర్ తో పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఫైట్ ఆత్మగౌరవానికి సంబంధించింది. ఏది ఏమైనా తమను కాదన్న కేసీఆర్ పార్టీ అభ్యర్థులే పార్టీని ఓడించి నేడు మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం విశేషం అని చెప్పాలి. ప్రజా ఆదరణ కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీనే తప్ప తాము కాదని ఈ ముగ్గురు నేతలు నిరూపించారు.

ఇక ఈరోజు రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ప్రజలంతా ఈ వేడుకను పండుగలాగా తిలకించారు. ఇక రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సిని రాజకీయ ప్రభకులు విషెస్ తెలియజేశారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పై ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యువత నిరుద్యోగులు రైతులు మహిళలు ఆయనపై చాలా ఆశలు పెట్టుకున్నారు. వచ్చిన హామీలను ఆయన నెరవేర్చాలని కోరుకుంటున్నారు. ఇక సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి సంతకం 6 గ్యారంటీలపై చేశారు. ఇక రెండవ సంతకంగా దివ్యాంగురాలు అయిన రజినీకి ఉద్యోగం కల్పిస్తూ ఫైల్ పై సంతకం చేశారు. ఏది ఏమైనా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ రెండిటిపై సంతకం చేయడం అందరిని ఆకట్టుకుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది