Pawan Kalyan – KCR : బ్రేకింగ్.. పవన్ కళ్యాణ్ కి కేసీఆర్ 1000 కోట్లు?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan – KCR : బ్రేకింగ్.. పవన్ కళ్యాణ్ కి కేసీఆర్ 1000 కోట్లు??

Pawan Kalyan – KCR : అవునా.. నిజమేనా. కేసీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య అంత రిలేషన్ షిప్ ఉందా? 2024 లో చంద్రబాబును ఓడించేందుకు పవన్ కళ్యాణ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లు ఇచ్చారా? అది నిజమేనా. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అసలు.. ఏపీకి చెందిన చంద్రబాబు ఓడిపోతే.. తెలంగాణలో కేసీఆర్ కు వచ్చే లాభం ఏంటి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. 2024 లో చంద్రబాబును ఏపీలో మళ్లీ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :19 February 2023,9:00 pm

Pawan Kalyan – KCR : అవునా.. నిజమేనా. కేసీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య అంత రిలేషన్ షిప్ ఉందా? 2024 లో చంద్రబాబును ఓడించేందుకు పవన్ కళ్యాణ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లు ఇచ్చారా? అది నిజమేనా. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అసలు.. ఏపీకి చెందిన చంద్రబాబు ఓడిపోతే.. తెలంగాణలో కేసీఆర్ కు వచ్చే లాభం ఏంటి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. 2024 లో చంద్రబాబును ఏపీలో మళ్లీ ఓడించాలని..దాని కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారట. ఆ ఒప్పందం విలువ రూ.1000 కోట్లు అట.

kcr offers thousand crores to pawan kalyan to defeat chandrababu

kcr offers thousand crores to pawan kalyan-to defeat chandrababu

ఇదంతా చెప్పింది ఎవరో కాదు.. ఎల్లో మీడియాగా పేరొందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ ఎండీ ఆర్కే చేసిన వ్యాఖ్యలు. ఆర్కే పలుకు పేరుతో ఆయన రాసిన రాతలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీలో టీడీపీకి జనసేనను దూరం చేయాలని, కాపు సామాజిక వర్గం ఓట్లను దూరం చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ రూ.1000 కోట్ల ఆఫర్ ఇచ్చారట. కాపు నాయకులు పవన్ కళ్యాణ్ కు బ్రెయిన్ వాష్ చేస్తున్నారని.. అందుకే ఏపీ కాపు నాయకులు.. ఇప్పటికే పవన్ తో మాట్లాడారని చెప్పుకొచ్చారు. అంతే కాదు..

kcr offers thousand crores to pawan kalyan-to defeat chandrababu

kcr offers thousand crores to pawan kalyan-to defeat chandrababu

Pawan Kalyan – KCR : కాపు నాయకులు పవన్ కు బ్రెయిన్ వాష్ చేస్తున్నారా?

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తెలంగాణ నుంచి రూపాయి కూడా నిధులు రాకుండా అడ్డుకోవడం కోసం.. హైదరాబాద్ లో ఉండే ఆంధ్రా వ్యాపారులను కూడా కేసీఆర్ కట్టడి చేసే పనిలో పడ్డారట. అంటే.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే అవకాశాలు ఉన్నాయని.. ఆ అవకాశాలను కావాలని కేసీఆర్ చెడగొడుతున్నారనే ఉద్దేశం వచ్చేలా ఆర్కే పలుకు ఉండటం గమనార్హం. అసలు.. రాధాకృష్ణకు ఇవన్నీ విషయాలు ఎలా తెలిశాయి. పవన్ కు కేసీఆర్ ఆఫర్ ఇచ్చారా? లేక.. కావాలని చంద్రబాబును హైలెట్ చేయడం కోసం.. కేసీఆర్ ను అడ్డం పెట్టుకొని ఎల్లో మీడియా పేరుతో చంద్రబాబు చెప్పినట్టుగా ఆర్కే తానా అంటే తందానా అన్నట్టుగా అంటున్నారా అంటూ రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది