
KCR heavy rain damage newly built yadadri temple
KCR : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికలో కేసీఆర్ మార్క్ సోషల్ ఇంజినీరింగ్ స్పష్టంగా కనబడుతున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరి ఊహాలకు అందని విధంగా కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేశారని అంటున్నారు.మంగళవారం టీఆర్ఎస్ అధినాయకత్వం ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు వెంనటే నామినేషన్స్ దాఖలు చేశారు. అయితే, ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం గమనార్హం.
టీఆర్ఎస్‌పై రెడ్డి సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరుగుతున్నదని రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో మూడు స్థానాలకు రెడ్డిలను ఎంపిక చేసి ఆ సామాజిక వర్గ మద్దతును కేసీఆర్ కూడగట్టే ప్రయత్నం చేసినట్లు అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఎమ్మెల్సీ కోటాలో నామినేట్ అయిన అభ్యర్థుల్లో మాజీ ఐఏఎస్ ఉన్నాడు.
సిద్దిపేట కలెక్టర్‌గా సేవలందించిన పి.వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కొద్ది క్షణాల్లోనే ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. మొత్తంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, పి.వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. మిగిలిన ముగ్గురిలో బండ ప్రకాష్ ముదిరాజ్.. కాగా, కడియం శ్రీహరి..ఎస్సీ, తక్కళ్లపల్లి రవీందర్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు.
kcr reddy community given priority for mlc
టీఆర్ఎస్‌కు ఉన్నటువంటి 103 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలంలో వీరు ఆరుగురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ప్రజెంట్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వరంగల్‌కు చెందిన బండ ప్రకాశ్ ముదిరాజ్ రాజ్యసభ పదవీ కాలం పూర్తి కావడానికి ఇంకా మూడేళ్ల టైం ఉంది. అయినప్పటికీ ఆయన్ను సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ చేస్తున్నారు. త్వరలో ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరిలు వరుసగా రెండో సారి శాసన మండలికి ఎన్నికవుతున్నారు.
హుజురాబాద్‌కు చెందిన పాడి కౌశిక్‌రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు కేసీఆర్. కానీ, ఆ నామినేషన్‌ను గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పక్కన పెట్టేశారు. దాంతో పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. మొత్తంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.