సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య అంతర్గత ఒప్పందం కుదిరినట్టు అనేక వార్తలు వెలువడడంతో పాటు ముఖ్యంగా కాంగ్రేస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. గల్లీలో కుస్తి ఢిల్లీలో దోస్తీ అంటూ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు సందిగ్ధంలో పడ్డాయి. ముఖ్యంగా బీజేపీ ఈ విషయంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోంటుంది. ఎందుకంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.
ఇందుకోసం కేంద్ర నాయకత్వాన్ని సైతం రంగంలోకి దింపుతూ తన ప్రాబల్యాన్ని పెంచుకునే వ్యూహాలకు తెరతీశారు. ఇక మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం తన పాదయాత్ర ద్వారా అనునిత్యం సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తన పాదయాత్రలో పూర్తిగా సీఎం కేసీఆర్ విధానాలపై ఆయన విరుచుకుపడుతున్నారు. అయితే ఓ వైపు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండగానే మరోవైపు సీఎం కేసిఆర్ గతంలో ఎన్నడు లేనట్టుగా వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి, ప్రధాని మోడితోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ పార్టీకి చెక్‌పెట్టేందుకు సీఎం కేసిఆర్ పావులు కదుతున్నారనే రాజకీయ విశ్లేషణలు కూడా కొనసాగాయి.
ఈ నేపథ్యంలోనే కేంద్రం నుండి వచ్చే నిధులపై మరోసారి ఇరువర్గాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. కేంద్రం నుండి వచ్చే నిధులపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుపడ్డారు. రాష్ట్రం నుండి తీసుకుపోయే ప్రతి రూపాయిలో కేవలం యాబై శాతం మాత్రమే తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయని ఆయన కేంద్రంపై విరుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న డబ్బులన్ని యూపీ లాంటీ రాష్ట్రాలకు వెళుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని బండి సంజయ్ ప్రచారం చేయడాన్ని తప్పు పట్టారు.
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న బీజేపీ బండి సంజయ్… మొత్తం నిధులు కేంద్రానివేనంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గత ఆరున్నరేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి అందిన ఆదాయం రూ.2.72లక్షల కోట్లు కాగా… కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.1.42లక్షల కోట్లు మాత్రమేనని కేటీఆర్ అన్నారు. ఇక తాను చెప్పిన లెక్కల్లో ఏదైనా తప్పని తేలితే రాజీనామా చేయడనికైనా సిద్దమని సవాల్ విసిరారు. లేదంటే బండి సంజయ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. తాను కేటిఆర్ మాటలు పట్టించుకోనని అన్నారు. ఆయన తుపాకి రాముడి మాటలు మాట్లాడతాడని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరం కలిసి మోడి వద్దకు వెళ్లి రాజీనామా చేస్తామని అప్పుడే నిజాలు తెలుస్తాయని ఆయన సమాధానం చెప్పారు. ఇక యూపిఏ కంటే ఎన్డీఏ హయాంలో 9 శాతం అదనంగా రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని ఆయన అన్నారు. దీంతో ఇరుపార్టీల మధ్య మరోసారి పొలిటికల్ హీట్ పెరిగినట్టయింది. మొన్నటి వరకు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు బండి సంజయ్‌పై విరుచుపడగా తాజాగా మంత్రి కేటిఆర్ బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం చెలరేగుతోంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.