BJP vs TRS : ఢిల్లీలో దోస్తీ.. తెలంగాణ గల్లీలలో కుస్తీ.. కేసీఆర్ ను ఇరకాటంలో పడేసి శభాష్ అనిపించుకున్న బండి సంజయ్.. ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BJP vs TRS : ఢిల్లీలో దోస్తీ.. తెలంగాణ గల్లీలలో కుస్తీ.. కేసీఆర్ ను ఇరకాటంలో పడేసి శభాష్ అనిపించుకున్న బండి సంజయ్.. ?

 Authored By sukanya | The Telugu News | Updated on :15 September 2021,10:00 pm

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య అంతర్గత ఒప్పందం కుదిరినట్టు అనేక వార్తలు వెలువడడంతో పాటు ముఖ్యంగా కాంగ్రేస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. గల్లీలో కుస్తి ఢిల్లీలో దోస్తీ అంటూ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు సందిగ్ధంలో పడ్డాయి. ముఖ్యంగా బీజేపీ ఈ విషయంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోంటుంది. ఎందుకంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.

ఇందుకోసం కేంద్ర నాయకత్వాన్ని సైతం రంగంలోకి దింపుతూ తన ప్రాబల్యాన్ని పెంచుకునే వ్యూహాలకు తెరతీశారు. ఇక మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం తన పాదయాత్ర ద్వారా అనునిత్యం సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తన పాదయాత్రలో పూర్తిగా సీఎం కేసీఆర్‌ విధానాలపై ఆయన విరుచుకుపడుతున్నారు. అయితే ఓ వైపు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండగానే మరోవైపు సీఎం కేసిఆర్ గతంలో ఎన్నడు లేనట్టుగా వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి, ప్రధాని మోడితోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ పార్టీకి చెక్‌పెట్టేందుకు సీఎం కేసిఆర్ పావులు కదుతున్నారనే రాజకీయ విశ్లేషణలు కూడా కొనసాగాయి.

KCR VS bandi Sanjay

KCR VS bandi Sanjay

కేటీఆర్, సంజయ్ రాజీనామాల రచ్చ KCR VS bandi Sanjay

ఈ నేపథ్యంలోనే కేంద్రం నుండి వచ్చే నిధులపై మరోసారి ఇరువర్గాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. కేంద్రం నుండి వచ్చే నిధులపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుపడ్డారు. రాష్ట్రం నుండి తీసుకుపోయే ప్రతి రూపాయిలో కేవలం యాబై శాతం మాత్రమే తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయని ఆయన కేంద్రంపై విరుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న డబ్బులన్ని యూపీ లాంటీ రాష్ట్రాలకు వెళుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని బండి సంజయ్ ప్రచారం చేయడాన్ని తప్పు పట్టారు.

ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న బీజేపీ బండి సంజయ్… మొత్తం నిధులు కేంద్రానివేనంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గత ఆరున్నరేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి అందిన ఆదాయం రూ.2.72లక్షల కోట్లు కాగా… కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.1.42లక్షల కోట్లు మాత్రమేనని కేటీఆర్ అన్నారు. ఇక తాను చెప్పిన లెక్కల్లో ఏదైనా తప్పని తేలితే రాజీనామా చేయడనికైనా సిద్దమని సవాల్ విసిరారు. లేదంటే బండి సంజయ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కేసీఆర్ రాజీనామా చేయాలన్న బండి KCR VS bandi Sanjay

దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. తాను కేటిఆర్ మాటలు పట్టించుకోనని అన్నారు. ఆయన తుపాకి రాముడి మాటలు మాట్లాడతాడని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరం కలిసి మోడి వద్దకు వెళ్లి రాజీనామా చేస్తామని అప్పుడే నిజాలు తెలుస్తాయని ఆయన సమాధానం చెప్పారు. ఇక యూపిఏ కంటే ఎన్డీఏ హయాంలో 9 శాతం అదనంగా రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని ఆయన అన్నారు. దీంతో ఇరుపార్టీల మధ్య మరోసారి పొలిటికల్ హీట్ పెరిగినట్టయింది. మొన్నటి వరకు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు బండి సంజయ్‌పై విరుచుపడగా తాజాగా మంత్రి కేటిఆర్ బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం చెలరేగుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది