Kalvakuntla Kavitha : విలవిలలాడుతోన్న కేసీఆర్ .. నువ్ ఒక్క దానివే కాపాడగలవమ్మా కవితమ్మా..!
Kalvakuntla Kavitha : మునుగోడు ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు చెమటలు పట్టిస్తున్నాయి. సీఎం కేసీఆర్ కూతురు.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినిపించడంతో బీజేపీ టార్గెట్ చేస్తోంది. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీంతో కేసీఆర్ కు డాటర్ పరంగా తలనొప్పి స్టార్ట్ అయిందంటున్నారు విశ్లేషకులు. ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఇష్యూ రేకెత్తడం.. రేపు ప్రచారంలో ప్రతిపక్షాలు గట్టిగానే వాడుకుంటాయి.. దీనికి టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
Kalvakuntla Kavitha : కవిత పరువు నష్టం దావా…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉన్నట్టు బీజేపీ గట్టిగా చెబుతోంది. అయితే తాను తెలంగాణ సీఎం కేసీఆర్ కూతుర్ని కావడం వల్లే బీజేపీ టార్గెట్ చేస్తోందని కవిత తిప్పికొడుతోంది. కానీ బీజేపీ మాత్రం మరోసారి కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుపుతోందని తేల్చి చెప్పడం సర్వత్రా చర్చకు దారి తీసింది. తనపై తీవ్ర విమర్శల నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లాల కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఇక నిన్నటి వేళా కవిత ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించన బీజేపీ నేతలో ఉద్రిక్తత నెలకొంది.. దీంతో మ్యాటర్ మరింత సీరియస్ అవుతోంది. ఇక బీజేపీ స్టేట్ చీఫ్ అరెస్టు వంటివి జరగడంతో టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్దం జరుగుతోంది.
Kalvakuntla Kavitha : ఎందుకు భయపడుతున్నారు..?
కాగా కవిత ఎంతలా కొట్టిపారేస్తున్నా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మరోసారి కవితపై ఆరోణలను తీవ్రతరం చేయడం గమనార్హం. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేకుంటే తమ పార్టీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు పూర్తిగా శోధించి నిజానిజాలను బయటకి తీస్తాయని చెప్పుకొచ్చారు. తాము ఆరోపణలు చేస్తే కవిత ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాగా ఈ మీడియా సమావేశంలో మరో ఎంపీ పర్వేష్‌వర్మ పాల్గొన్నారు. దీంతో ఈ వ్యవహారం అంతా కేసీఆర్ ని ఆందోళన పెట్టిస్తున్నాయి.. ఈ ఉప ఎన్నికకు కూతురి రూపంలో నష్టం జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. మోడీతో ఢీ అంటే ఢీ అంటున్న తరుణంలో కేసీఆర్ కు కొత్త తలనొప్పి వచ్చిపడిందటున్నారు. ఇక కవిత ఈ ఆరోపణల్లోంచి బయటపడితే కానీ కేసీఆర్ కి మనశ్శాంతి ఉండేలా లేదు.