Covid Vaccination : పిల్లలకు కరోనా టీకా వేయిస్తున్నారా…? అయితే ఇవి గుర్తుంచుకోండి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Covid Vaccination : పిల్లలకు కరోనా టీకా వేయిస్తున్నారా…? అయితే ఇవి గుర్తుంచుకోండి..

 Authored By mallesh | The Telugu News | Updated on :4 January 2022,10:00 pm

Covid Vaccination : కరోనా వైరస్.. ఈ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దీని నుంచి బయటపడేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ వైరస్ రూపాంతంరం చెందుకుంటూ వివిధ వేరియంట్ల రూపంలో ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. ఫస్ట్ వేవ్, సేకండ్ వేవ్‌లో దేశంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచింది. ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిని వారికి టీకాను రెండు డోసులుగా వేయగా తాజాగా15 నుంచి 18 సంవత్సరాల లోపు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిర్ణయించింది.

నిన్నటి నుంచి టీకాలు ఇవ్వడం సైతం మొదలుపెట్టారు. వీరికి వ్యాక్సిన్ పూర్తయ్యే సమయానికి 12 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేసే చాన్స్ ఉంది. దీనిపైనా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం 2007 నుంచి తర్వాత జన్మించిన వారికి మాత్రమే టీకాలు వేస్తోంది.ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి అందరికీ కొవాక్సిన్ టీకా వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీరికే కాకుండా 12-18 ఏళ్ల వారికి సైతం దీనిని అత్యవసరంగా యూజ్ చేయొచ్చు.కానీ భారత్‌లో ఈ వయస్సు పిల్లల వారికి టీకా ఇచ్చేందుకు ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదు.

keep things in mind when vaccinatin children with corona vaccine

keep things in mind when vaccinatin children with corona vaccine

Covid Vaccination : కొవాక్సిన్ ఇచ్చేందుకు నిర్ణయం

15 నుంచి 18 సంవత్సరాల లోపు వారు లోపు ఆధారకార్డు వివరాలతో కోవిన్ యాప్‌ లో రిజిస్టర్ చేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొద్దిగా జర్వం, బాడీ పెయిన్స్, వంటివి వచ్చే చాన్స్ ఉంది. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడొద్దు. కేవలం పారసెటమాల్ మాత్ర వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైనా సందేహాలు కలిగితే వ్యాక్సిన్ తీసుకునే సమయంలో అక్కడి డాక్టర్ ను సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోండి. టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా నిబంధనలు తప్పక పాటించాలి.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది