Vizag YCP : విశాఖ వైసీపీ పూర్తి ప్రక్షాళన.. అవంతి, అమర్ సహా కీలక నేతల మార్పు.. వీడియో
Vizag YCP : ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ మూడు జిల్లాల్లో ఎందుకు మైనస్ ఉంది. మనం రాజధాని వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి సీఎం వైజాగ్ ను పరిపాలన రాజధాని అని చెప్పారు. వైజాగ్ వచ్చి పాలన చేస్తా అన్నారు. పెట్టుబడి కోసం ప్రత్యేక సదస్సును కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా కూడా వైసీపీకి ఉత్తరాంధ్ర జిల్లాలు ఎందుకు మైనస్ అయ్యాయి. అక్కడ నాయకత్వలేమి ఉందా? పార్టీలో మార్పులు చేర్పులు చేయాలా అని వైసీపీ నేతలు దృష్టి పెట్టారు.
9 నెలల కిందనే ఉత్తరాంధ్రలో మైనస్ ఉందని తెలుసుకొని అక్కడ ఉన్న ఇన్ చార్జ్ ను మార్చి కొత్త ఇన్ చార్జ్ ను నియమించారు. వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జ్ గా పెట్టి.. విజయసాయిరెడ్డికి వేరే బాధ్యతలు అప్పగించారు. అప్పటి వరకు చాలా నియోజకవర్గాల్లో రెండు గ్రూపులు ఉండేవి. సుబ్బారెడ్డి వచ్చాక గ్రూపులు తగ్గాయి. గ్రూపులు లేవు కానీ.. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజల్లోనే మార్పు ఉంది. ప్రజల్లోనే వ్యతిరేకత ఉంది. పైగా.. జనసేన పార్టీ, టీడీపీ కూటమిగా పొత్తు పెట్టుకుంటే చాలా నియోజకవర్గాలు పోయే ప్రమాదం ఉంది. అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చేరాలి. అందుకే.. వైజాగ్ జిల్లాలో ప్రక్షాళన చేయాలని అధిష్ఠానం కంకణం కట్టుకుంది. వైజాగ్ లో ఎందుకు ప్రక్షాళన అంటే ఇక్కడ టీడీపీ కాస్త బలంగానే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి 4 సీట్లు వచ్చాయి.
Vizag YCP : ఉత్తరాంధ్ర ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా?
జనసేన పార్టీకి కూడా ఓటు బ్యాంకు ఉంది. ఈ రెండు పార్టీలు కలిస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు వాళ్ల వైపు వెళ్లనున్నాయి. అందుకే వైజాగ్ లో నాయకత్వాన్ని మార్చడం లాంటివి చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్ ను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం, గుడివాడ అమర్నాథ్.. అనకాపల్లి ఎమ్మెల్యే. ఆయన్ను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారని అంటున్నారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే భీమిలి, అనకాపల్లి, ఇతర నియోజకవర్గాలు, గాజువాక, పెందుర్తి, నర్సీపట్నం, పాయకరావుపేట వీటి ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. వైసీపీకి అది దెబ్బే.. అందుకే వైజాగ్ జిల్లాలో పలు మార్పులను వైసీపీ శ్రీకారం చుట్టింది.