Khammam : పారిశుద్ధ్యం లోపిస్తే.. ఇంటి యజమానులకు కూడా జరిమానా : కలెక్టర్ గౌతమ్
Khammam : ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. వర్షాకాలం సీజన్ లో సీజనల్ వ్యాధులు సోకకుండా.. పారిశుద్ధ్యంపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. ఆయన జిల్లాలోని కారేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.
ఈసందర్భంగా ఆయన గ్రామంలో పారిశుద్ధ్యం పనులను పర్యవేక్షించారు. స్థానిక అధికారులతో, ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. గ్రామస్తులకు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ.. పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం లోపిస్తే.. ఇంటి యజమానులకు కూడా జరిమానాలు విధించండి.. అంటూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మండలంలోని మాధారం, పేరుపల్లి గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్.. మాస్కులు లేకుండా గ్రామంలో తిరిగినా.. ఇంటి ముందు పరిశుభ్రంగా లేకున్నా.. ఫైన్లు విధించాలంటూ సర్పంచ్ లు, కార్యదర్శులకు తెలిపారు. అలాగే.. కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.