Kodali Nani : జనసేనతో పోటీ గట్టిగా… వార్ వన్ సైడ్ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు వైరల్ వీడియో..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kodali Nani : జనసేనతో పోటీ గట్టిగా… వార్ వన్ సైడ్ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు వైరల్ వీడియో..!!

Kodali Nani ; గుడివాడ నియోజకవర్గంలో ఓ ప్రముఖ దేవాలయంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అనేక ఎన్నికలలో ప్రజలు ముఖ్యమంత్రి జగన్ గారికి 90% విజయాలు అందిస్తున్నారు. అయితే రేపు జరగబోయే 2024 ఎన్నికలకు సంబంధించి.. కొంతమంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరికొన్ని పార్టీలు కలిసి రాబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్న ధైర్యం […]

 Authored By sekhar | The Telugu News | Updated on :5 March 2023,5:00 pm

Kodali Nani ; గుడివాడ నియోజకవర్గంలో ఓ ప్రముఖ దేవాలయంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అనేక ఎన్నికలలో ప్రజలు ముఖ్యమంత్రి జగన్ గారికి 90% విజయాలు అందిస్తున్నారు. అయితే రేపు జరగబోయే 2024 ఎన్నికలకు సంబంధించి.. కొంతమంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరికొన్ని పార్టీలు కలిసి రాబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్న ధైర్యం ప్రజలే అని తెలిపారు.

Kodali Nani About Pawan kalyan Janasena Party

Kodali Nani About Pawan kalyan Janasena Party

రాష్ట్రంలో ఎప్పటికప్పుడు తాము చేయిస్తున్న సర్వేలలో 151 సీటుకు ఒకటి కూడా తగ్గదని ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని… కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో నాని గెలవాలన్న పైన జగన్ గెలవాలన్న రాష్ట్రంలో ప్రజలు డిసైడ్ చేయాలని… రాజకీయ నాయకులు కలవడం వల్ల భయపడాల్సిన అవసరం ఏమీ లేదని తెలిపారు. జగన్ గారు 175 కి 175 టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆయన ఏదో అల్లాటప్పగా టార్గెట్ పెట్టుకోలేదు.

Kodali Nani About Pawan kalyan Janasena Party

Kodali Nani About Pawan kalyan Janasena Party

రాజకీయాల్లోకి రాకముందు బిజినెస్ చేసిన వ్యక్తి. ఒక కార్పొరేట్ ఆఫీస్ ఎలా రన్ చేస్తారో… ఆ రీతిగానే . సీఎం క్యాంప్ ఆఫీస్, రాజకీయాలను అలాగే నడుపుతారు. అయితే మాకు ఉన్న లెక్కలు బట్టి 175 సీట్లకు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వస్తే… టైట్ గా.. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉండేది కేవలం 18 స్థానాల్లోనే. మిగిలిన అన్నిచోట్ల వార్ వన్ సైడ్. జగన్ గారు ఏ అభ్యర్థి పెట్టిన గెలిచే పరిస్థితి ఆయా నియోజకవర్గాల్లో ఉందని స్పష్టం చేశారు. కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది