Kodali Nani : కొడాలి నాని మీద కాలు పెట్టి కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్.. ఫోటో వైరల్..!
Kodali Nani : వైసీపీలో ట్రబుల్ షూటర్ ఎవరు అంటే టక్కున వచ్చే సమాధానం కొడాలి నాని. మొన్నటి వరకు మంత్రిగా చేసిన కొడాలి నాని.. ప్రస్తుతం మాజీ మంత్రి అయిపోయారు. కొడాలి నాని, ఆర్ఆర్ఆర్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఈ ముగ్గురూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు కాదు.. చాలా ఏళ్ల నుంచి వాళ్లు మంచి స్నేహితులు. వీళ్లు ముగ్గురు కలిసి ఎప్పుడో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పాత ఫోటో అయినా కూడా ఆ ఫోటోకు ఉన్న ప్రత్యేకత కారణంగా ఆ ఫోటోను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్.. కొడాలి నాని మీద కాళ్లు వేసి కూర్చొన్న ఫోటో అది. జూనియర్ ఎన్టీఆర్ ఏదో జోక్ పేల్చగా వల్లభనేని వంశీ పగలబడిన నవ్వుతున్నాడు. కానీ.. కొడాలి నాని మాత్రం సీరియస్ గా ఏదో పని చేస్తున్నట్టు కనిపిస్తాడు ఈ ఫోటోలో. ఇది ఏదో సినిమా షూటింగ్ సందర్భంగా తీసిన ఫోటో అని తెలుస్తోంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ.. వీళ్లిద్దరూ గతంలో నిర్మాతలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వీళ్లు జూనియర్ ఎన్టీఆర్ తో పలు సినిమాలు నిర్మించారు. ఆ సమయంలో తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

kodali nani and junior ntr photo viral
Kodali Nani : జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో తీసిన ఫోటోనే అది
జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి ఫోటో అది. రెండు మూడు సినిమాలే తీసి అప్పుడప్పుడే ఇండస్ట్రీలో తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంగా వీళ్లు ముగ్గురు కలిసి ఉండటం.. కొడాలి నాని మీద ఎన్టీఆర్ కాలు వేయడం అనేది ప్రస్తుతం చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కొడాలి నాని మీద కాలు వేసి కూర్చున్నాడంటే వీళ్ల మధ్య ఎంత అనుబంధం ఉందో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా చాలా ఏళ్ల నాటి అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు కూడా ఆ ఫోటోను చూసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.