Raj Gopal Reddy | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ: “పార్టీ మారడం లేదు.. దుష్ప్రచారం నమ్మొద్దు”
Raj Gopal Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. “నేను పార్టీ మారుతున్నానని కొందరు కావాలనే అపోహలు వ్యాప్తి చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం” అని స్పష్టం చేశారు.
#image_title
అవన్నీ అవాస్తవాలు..
గురువారం ఆయన చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం చెరువును పరిశీలించి, గంగ హారతిలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, చౌటుప్పల్ అభివృద్ధికి రూ. 500 కోట్ల ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. “చెరువుల నుంచి నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికలతో వరదనీరు దండు మల్కాపురం, లక్కారం వైపు మళ్లించాం. దీని వల్ల ప్రజలు పెద్ద ముప్పు నుంచి తప్పుకున్నారు” అని వివరించారు.
రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ .. “నాపై సొంత పార్టీ నాయకులే కాక బయట పార్టీ నేతలు కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారుతున్నానని ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రజలు ఈ అబద్ధాలను నమ్మొద్దు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా స్వయంగా మీడియా సమావేశం పెట్టి ప్రకటిస్తాను” అని స్పష్టం చేశారు. తాను సిన్సియర్ కాంగ్రెస్ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా పని చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. “పార్టీ అధిష్ఠానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటాను. నా ముందు మునుగోడు అభివృద్ధి తప్ప మరే లక్ష్యం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.