Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ ను భూస్థాపితం చేసే సూపర్బ్ ప్లాన్ అమలు చేయబోతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy : తెలుగు రాష్ట్రాల్లో అసలే అంతంత మాత్రంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఓ 10 నుంచి 20 మంది నాయకులతో అలా నడిపించేస్తున్నారు ఇప్పుడు పార్టీని. తెలంగాణలో అయితే మరీ ఘోరం. ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బాటలోనే తన అన్న వెంకట్ రెడ్డి కూడా నడవబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్నాడు. కానీ.. త్వరలోనే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతల్లో కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు. ఇద్దరిలో ఇప్పటికే ఒక నేత పార్టీకి గుడ్ బై చెప్పాడు. ఇక మిగిలింది వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ఈ విషయం తెలిసినా కూడా లైట్ తీసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది.
Komatireddy Venkat Reddy : అందుకే వెంకట్ రెడ్డి బీజేపీ నేతలను కలిశాడా?
కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయనతో చాలామంది నేతలు కొంచెం అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఆయన మీద కోపంతోనే కొందరు నేతలు పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది. అందుకే కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వరుసగా బీజేపీ నేతలను కలుస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని మోదీని కూడా కలుస్తున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి.
ఒకవేళ ఇప్పుడే బీజేపీలో చేరితే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏవైనా గడ్డు పరిస్థితులు ఏర్పడితే ఎలా అనే విషయాలపై కూడా వెంకట్ రెడ్డి పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అందుకే.. అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగి..బీజేపీలో చేరాలి అని వెంకట్ రెడ్డి నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు.. కొమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు దాసోజు శ్రవణ్ కుమార్ కూడా పార్టీని వీడటంతో ఇక కాంగ్రెస్ పార్టీకి మిగిలేది రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ముగ్గురు నేతలేనని.. దీంతో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.