Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2025,7:40 pm

ప్రధానాంశాలు:

  •  హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..!

  •  Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..!

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎర్రమంజిల్‌లోని ఆర్‌ అండ్ బీ కార్యాలయంలో రోడ్లపై సమీక్ష నిర్వహించిన కోమటిరెడ్డి.. ఆ వివరాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు చివరి వరకు అన్ని అగ్రిమెంట్లు పూర్తయ్యేలా చూస్తామన్నారు. సెప్టెంబర్ నెలలో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పటికే హ్యామ్ మోడల్ ద్వారా రోడ్ల నిర్మాణం జరుగుతోందని, తెలంగాణలో కూడా ఈ మోడల్ ద్వారా రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయని అన్నారు.

Komatireddy Venkat Reddy హరీష్ కేటీఆర్ నా స్థాయి కాదు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..!

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

అలాగే మాజీ మంత్రి హరీష్ రావు పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. “హరీష్ రావు ఎవరో నాకు తెలియదు, ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే. కనీసం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కారు” అని వ్యాఖ్యానించారు. అలాగే కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతల్ని తాము లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే చర్చకు సిద్ధమని, ఆయన సూచనలు ఉన్నా తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం 42 బ్రిడ్జ్‌లను అప్రూవల్ లేకుండా వదిలేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఆర్ అండ్ బీలో వివాదాలు లేకుండా పోస్టింగ్స్, ప్రమోషన్స్ చేస్తున్నదని, గతంలో ఏఈ రిక్రూట్ చేయలేదని తెలిపారు.

రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ ఇప్పటికే కొనసాగుతున్న పనులకు రూ.300 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ, గడ్కరీని కలవబోతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా RRR ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు. రహదారుల నిర్మాణం ప్రజల కోసమేనని, తాము పేరు కోసం ఈ పనులు చేస్తున్నామన్న అభిప్రాయం లేదని స్పష్టం చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది