Kovai Sarala : కోవై స‌ర‌ళ ఇంత దారుణంగా మారిపోయింది, ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kovai Sarala : కోవై స‌ర‌ళ ఇంత దారుణంగా మారిపోయింది, ఏంటి?

 Authored By sandeep | The Telugu News | Updated on :21 May 2022,6:30 pm

Kovai Sarala: కోట్ల న‌వ్వులు పూయించిన కోవై స‌ర‌ళ కొన్నాళ్లుగా వెండితెర‌పై కనిపించ‌డం లేదు. ఆమె కామెడీకి ప‌ర‌వ‌శించని వారు లేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ అంటే నవ్వనీ వారంటూ ఎవరూ ఉండరు. ఇక వీరిద్దరి టైమింగ్ కి అంత క్రేజ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తమ కెరియర్లో దాదాపుగా 850 పైగా సినిమాలలో నటించింది కోవై సరళ. ప్రస్తుతం ఈమె వయస్సు 60 సంవత్సరాలు కావడంతో సినిమా అవకాశాలు తగ్గాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే సరళ స్ట్రైట్ గా సినిమా చేసి దాదాపుగా ఏడు సంవత్సరాల పైన అవుతోంది. అంతేకాకుండా తెలుగు లో ఎటువంటి ప్రోగ్రామ్స్ , అవార్డు ఫంక్షన్ లలో కూడా ఈమె కనిపించడం లేదు. అప్పుడ‌ప్పుడు త‌మిళ సినిమాల‌లో మాత్ర‌మే మెరుస్తుంది.

kovai sarala looks different

kovai-sarala-looks-different

గుర్తు ప‌ట్ట‌లేకుండా ఉందిగా..!

2019లో వ‌చ్చిన అభినేత్రి-2 చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించినా కోవై స‌ర‌ళ ఇన్నాళ్ల‌కు మ‌రొక సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. కోవై స‌ర‌ళ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం సెంబీ. అర‌ణ్య చిత్రంతో తెలుగు వారికి సుప‌రిచితుడైన ప్ర‌భు సాల్మాన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను తాజాగా విడుల చేసారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్‌లో కోవై స‌ర‌ళ గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది. ర‌ఫ్ లుక్‌లో త‌ల‌కు క్లాత్ క‌ట్టుకుని చిన్నారిని అక్కున చేర్చుకొని దీన స్థితిలో ఉన్న‌ట్టు క‌నిపించింది.

స‌డెన్‌గా ఈవిడ‌ని చూసిన కోవై స‌ర‌ళ అంటే న‌మ్మ‌బుద్ధి కావ‌డం లేదని చెబుతున్నారు. చూస్తుంటే చిత్రంలో కోవై స‌రళ చాలా సీరియ‌స్ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో తంబీ రామ‌య్య‌, బాల‌న‌టి నీలా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల‌వ్వ‌నుంది. చాలా రోజుల త‌రువాత రీ ఎంట్రీ ఇస్తున్న ఈ లేడీ కమెడీయ‌న్ ఈ సినిమాతో హిట్ కొడుతుందో లేదో వేచి చూడాలి మ‌రి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది