Ayurvedic Medicine Formula : ఆయుర్వేద మందు ఫార్ములా విషయంలో హైకోర్టులో ఆనందయ్య పిటిషన్
Ayurvedic Medicine Formula : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆనందయ్య మందు గురించే చర్చ. ఆనందయ్య మందు వాడితే కరోనా పరార్ అవుతోంది. దీంతో ఆయన మందుకు చాలా డిమాండ్ ఏర్పడింది. అయితే.. ఆయన కరోనా మందులో వాడే వన మూలికలను అన్నింటినీ చెప్పేశారు. ఆయన తయారు చేసే ఐదు రకాల మందులలో ఏ వన మూలికలను వాడుతున్నారో కూడా ప్రపంచానికి తెలియజేశారు. కానీ.. ఆ మందు ఫార్ములా మాత్రం ఒక్క ఆనందయ్యకే తెలుసు.
అయితే.. తన ఆయుర్వేద మందుకు సంబంధించిన ఫార్ములాను చెప్పాలంటూ.. కొందరు అధికారులు తనను వేధిస్తున్నారని ఆనందయ్య తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం, కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం, ప్రజలను బతికించడం కోసం తాను ఈ ఆయుర్వేద మందును తయారు చేశాను తప్పితే.. వ్యాపారం కోసం కాదు అని.. డబ్బుల కోసం కాదు అని ఆనందయ్య పిటిషన్ లో పేర్కొన్నారు.
ప్రజల రక్షణ కోసం, ప్రజల జీవితాలను కాపాడటం కోసం తయారు చేసిన ఈ మందును కల్తీ కాకుండా ఆపాలని.. దానికి తగిన రక్షణ కల్పించాలని.. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా.. అధికారులను ఆదేశించాలని హైకోర్టును ఆనందయ్య కోరారు. అధికారులు ఇలా ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధం అని ఆయన స్పష్టం చేశారు.
Ayurvedic Medicine Formula : ఫార్ములా బయటికి వస్తే.. ఆ మందును వ్యాపారం చేస్తారు
ఒకవేళ కరోనా మందుకు సంబంధించిన ఫార్ములా బయటికి వస్తే.. కొందరు వ్యాపారులు.. దాన్ని వ్యాపారం చేస్తారని.. కల్తీ చేస్తారని.. దాని వల్ల ప్రజలకే ఇబ్బందులు ఏర్పడతాయని ఆనందయ్య పిటిషన్ లో పేర్కొన్నారు. ఆయుర్వేద మందు తయారీ కోసం వాడే సూత్రాన్ని తమకు తెలియజేయాలంటూ నెల్లూరుకు చెందిన కొందరు అధికారులు తనను వేధిస్తున్నారని ఆనందయ్య తెలిపారు. లోకాయుక్త ఆదేశాలు ఇవ్వడంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి.. ఆయుష్ కమిషనర్ నేతృత్వంలో.. ఔషధాన్ని పరిశీలించారు. ఆ తర్వాత దాని ఫార్ములాను చెప్పాలంటూ తనను వేధిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఆనందయ్య పిటిషన్ దాఖలు చేశారు.