YS Jagan : జగన్ నెత్తిన పాలు పోసిన ఏపీ హైకోర్టు.. జగన్ మొదటి నుంచీ చెప్పినదే కరక్ట్ అన్న జడ్జిగారు..!
YS Jagan : నీట్ పరీక్షకు హాజరు అవడానికి కనీస వయో పరిమితి 17 ఏళ్లు. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఇటీవల ఓ పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. దానిపై తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. కనీస వయసును 17 ఏళ్లు నిర్ణయించడం అంటే సమానత్వపు హక్కును హరించినట్టు ఎలా అవుతుందని కోర్టు పిటిషనర్ కు మొట్టికాయలు వేసింది. దీనిపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
కనీస వయోపరిమితి నిబంధనను కొట్టేయాలంటూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కనీస వయోపరిమితి నిబంధన ఉండకూడదంటూ ఆయన వ్యాజ్యం వేశారు. అయితే.. దానిపై హైకోర్ట్ సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం దీనిపై తీర్పు వెలువరించింది. గతంలో కూడా ఇలాంటి వ్యాజ్యం దాఖలు అయిందని, దాన్ని ఉమ్మడి హైకోర్టు అప్పట్లోనే కొట్టేసిందని
YS Jagan : గతంలోనే ఉమ్మడి హైకోర్టు కొట్టేసిన అంశాన్ని గుర్తు చేసిన కోర్టు
ధర్మాసనం ఉటకించింది. వీళ్ల వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఇప్పటికే తీర్పు వచ్చినందున దానికి విరుద్ధంగా తాము తీర్పు చెప్పలేమని స్పష్టం చేసింది. నీట్ అర్హత విషయంలో అది పూర్తిగా విద్యాశాఖకు సంబంధించినదని, కోర్టు అందులో తలదూర్చదని కోర్టు స్పష్టం చేయడంతో సీఎం జగన్ కు కోర్టు మద్దతు ఇచ్చినట్టు అయింది. ఏపీ హైకోర్టు.. జగన్ సర్కారు ఒకరకంగా మెచ్చుకున్నట్టే. జగన్ నీట్ విషయంలో ఫస్ట్ నుంచి చెబుతున్న విషయం కరెక్టే అని ఏపీ ధర్మాసనం వెలువరించింది.