KTR Son Himanshu : హిమాన్షు ఫోటోలు వైరల్… గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కేటీఆర్ కొడుకు…
KTR Son Himanshu : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే అయితే తాజాగా కేటీఆర్ కొడుకు హిమాన్షు గురించి ఓ ఫోటో వైరల్ అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు .అతను అందరికి తెలుసు .కేసీఆర్ కు మనవడు అంటే చాలా ఇష్టం .ఈ విషయం చాలాసార్లు కేసీఆర్ మాటల్లోనే అర్థం అవుతుంది .ఇక కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు హిమాన్షుని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే .చాలాసార్లు బాడీ షేమింగ్ కి కూడా గురయ్యాడు.
సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉండే హిమన్షు ఇలాంటి కామెంట్స్ కి తనదైనా స్టైల్ లో దీటుగా సమాధానమిస్తాడు .మాటలలో తాతకి ఏ మాత్రం తీసుకుపోడు. తాతకి తగ్గ మనవడు అనిపించుకుంటాడు . ఇక కొన్ని రోజుల క్రితం ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ ప్రెసిడెంట్ గా హిమాన్ష్ ఎన్నికయ్యాడు. ఇక తరచు సోషల్ మీడియా లో ఫోటో లు షేర్ చేసే హిమాన్షు రీసెంట్ గా ట్విట్టర్ లో ఒక ఫోటో ని షేర్ చేసాడు. అ ఫొటో ని చూసిన జనాలు ఆశ్యర్యపోతున్నారు. అతడు హిమాన్షునేనా, అసలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాడు ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు .
తాజాగా హిమాన్షు వరల్డ్ ఫేమస్ డిజెలలో ఒకరైన అలెన్ వాకర్ ని కలిసిన సందర్భంగా తనతో దిగిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు.ఈ ఫోటోలలో హిమాన్షు చాలా సన్నగా ఉన్నాడు .కర్లీ హెయిర్ తో స్లిమ్ముగా అల్ట్రా మోడ్రన్ లుక్ లో ఉన్న ,హిమాన్షు ని పోల్చుకోవడం కొంచెం కష్టమే. అయితే హైదరాబాదులోని శంషాబాద్ లో షో నిర్వహించడానికి వచ్చిన అలెన్ వాకర్ ను కలిసిన సందర్భంగా తనతో దిగిన ఫోటోలను హిమాన్షు సోషల్ మీడియా షేర్ చేశాడు .అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
It was a pleasure to meet @IAmAlanWalker at his concert in Hyderabad. pic.twitter.com/0h84KWeMk7
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) September 25, 2022