YS Jagan : ఈయనేంటి ఇప్పుడు జగన్ ను కలిశారు? ఏపీలో ఇదే హాట్ టాపిక్?
YS Jagan : కేవీపీ తెలుసు కదా. కేవీపీ రామచంద్రరావు పేరు వినగానే మనకు గుర్తొచ్చే మరోపేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అవును.. ఇద్దరూ మంచి స్నేహితులు. వైఎస్సార్ కు కేవీపీ చాలా దగ్గరి మనిషి. సన్నిహితుడు కూడా. అలాగే… కేవీపీ బావమరిది అశోక్ కూడా వైఎస్సార్ అభిమానే. ఆయన ఎవరో కాదు… మాజీ మంత్రి కోటగిరి శిష్యుడు. కేవీపీ ఎంత ఫేమస్సో… ఆయన బావమరిది మేడవరపు అశోక్ కూడా అంతే ఫేమస్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ప్రజల కోసం అశోక్ ఎంతో సేవ చేస్తున్నారు.
వైఎస్సార్ మరణం తర్వాత అశోక్… వైఎస్ జగన్ వెంటే నడిచారు. 2014 ఎన్నికల కంటే ముందు నుంచి కూడా ఆయన జగన్ తోనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినా కూడా ఆయన పార్టీని వదల్లేదు. వైఎస్సార్ కాలంలో అశోక్… చింతలపూడి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున ఏఎంసీ చైర్మన్ గా పనిచేశారు. తర్వాత వైసీపీలో చేరి వైసీపీ పార్టీని బలోపేతం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందంటే దానికి ప్రధాన కారణం అశోకే.
YS Jagan : తాజా రాజకీయ పరిస్థితులపై జగన్ తో చర్చించిన అశోక్
అలాగే… పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చేలా చేయడంలో అశోక్ పాత్ర మరువలేనిది. ఏది ఏమైనా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ బలపేతం అవ్వడంలో ఎక్కువ కృషి చేసింది మాత్రం అశోక్ అనే చెప్పుకోవాలి. అయితే… ప్రస్తుతం ఈయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే… అశోక్ తాజాగా ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. అందుకే ఫోకస్ అంతా ప్రస్తుతం అశోక్ మీదికి షిఫ్ట్ అయింది.
సుమారు అరగంట పాటు అశోక్.. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ పరిస్థితులపై అశోక్… సీఎం జగన్ తో చర్చించారు. చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోటలో వైసీపీ రాజకీయ పరిస్థితులపై ఆయన సీఎంతో చర్చించారు. ఇంత సడెన్ గా అశోక్… సీఎం జగన్ ను కలవడంతో… అసలు ఏం జరుగుతోందా అని చింతలపూడి నియోజకవర్గం మొత్తం ఆసక్తితో ఎదురుచూస్తోంది. నియోజకవర్గం మొత్తం ఎక్కడ చూసినా… దీని గురించే చర్చ. ఇదే హాట్ టాపిక్ అయింది. అశోక్… ఇంత సడెన్ గా సీఎం జగన్ ను కలవడం వెనుక ఉన్న మర్మం ఏంటా? అని నియోజకవర్గ ప్రజలు తెగ గుసగుసలాడుకుంటున్నారు.