లేడీ కానిస్టేబుల్‌ సంధ్యారాణి కేసులో ట్విస్ట్‌.. అసలు దోషి ఎవ‌రంటే…?

0
Advertisement

లేడీ కానిస్టేబుల్ పెళ్లి వ్యవహారంలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న లేడీ కానిస్టేబుల్ సంధ్యారాణి తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన చరణ్ తేజ ఆరోపణలు చేశారు. అంతేకాదు తనకంటే ముందు మూడు పెళ్లిళ్లు చేసుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భర్త మరణించిన ఏడేళ్ల కూతురు ఉన్న ఆ మహిళా కానిస్టేబుల్ పై చరణ్ తేజ కావాలనే దుష్ప్రచారం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఆమెను వదిలించుకోవాలనే దురుద్దేశంతోనే అసత్య ప్రచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

నాలుగు నెలలుగా చిచ్చు

నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూసల చరణ్ తేజ రెండేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ సమయంలో కార్మిక నగర్ లో నివాసముంటున్న లేడీ కానిస్టేబుల్ సంధ్యారాణి ని ప్రేమించినట్లు పేర్కొన్నారు. తనకు పెళ్లై భర్త చనిపోయాడని, ఏడేళ్ల పాప ఉందని బాధితురాలు చెప్తే అందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఇద్దరూ కొన్నాళ్ల పాటు సహజీవనం చేసినట్లు తెలిపారు.

lady constable sandhya rani
lady constable sandhya rani

అనంతరం బాధితురాలి ఒత్తిడితో 2020 నవంబర్ 7న ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. పెళ్లి తర్వాతలేడీ కానిస్టేబుల్ సంధ్యారాణి కు ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చిందని తెలిపారు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో గత నాలుగు నెలలుగా చిచ్చు రేగినట్లు బాధితురాలు వెల్లడించారు.

దుష్ప్రచారమే..

ఒకరోజు తనకు చెప్పకుండా చరణ్ తేజ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని వాపోయారు. తన అత్తామామలే దీనికి కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విషయం తెలుసుకున్న చరణ్ తేజ ఆమెపై దుష్ప్రచారానికి ఒడిగట్టారు. నిత్య పెళ్లి కూతురు అంటూ సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. కాగా జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసుపై విచారణ జరిపారు. నిందితుడు చరణ్ తేజపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement