Lava Shark 2 | లావా షార్క్ 2: దేశీయ బ్రాండ్ లావా నుంచి మరో పవర్‌ఫుల్ 5G ఫోన్ వచ్చేసింది!
Lava Shark 2 | దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా మరోసారి భారత మార్కెట్‌కి సిద్ధమవుతోంది. గతేడాది విడుదలైన లావా షార్క్ 5Gకి కొనసాగింపుగా, తాజాగా ‘లావా షార్క్ 2’ మోడల్‌ను తీసుకురానుంది. ఇప్పటికే ఫోన్‌కు సంబంధించిన కీ ఫీచర్లు, డిజైన్ డీటెయిల్స్ని లావా అధికారికంగా ప్రకటించగా, లాంచ్‌కు ముందు ఈ ఫోన్ టెక్ సర్కిల్స్‌లో మంచి ఆసక్తిని రేపుతోంది.
#image_title
డిస్‌ప్లే డీటెయిల్స్:
లావా షార్క్ 2 ఫోన్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. ముఖ్యంగా గేమింగ్, వీడియో వీక్షణలో మెరుగైన అనుభవం కలిగించేందుకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. గత మోడల్ (షార్క్ 5G)లో 90Hz మాత్రమే ఉండగా, ఇప్పుడు మరింత అప్‌గ్రేడ్‌తో ఈ ఫీచర్ రావడం విశేషం. పైగా, సెల్ఫీ కెమెరా కోసం సెంటర్ హోల్-పంచ్ కటౌట్ డిజైన్ కూడా ట్రెండీగా ఉంటుంది.
లావా ఇప్పటికే టీజర్లలో వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ వెనుక భాగంలో గ్లాసీ ఫినిష్తో, ఎడమపై చదరపు కెమెరా మాడ్యూల్ ఉండనుంది. ఇది లావా బోల్డ్ ఎన్1 ప్రో మోడల్‌ను గుర్తు చేస్తోంది. ఫోటోగ్రఫీ పరంగా ఇందులో 50 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ కెమెరా స్పెసిఫికేషన్ ఇంకా వెల్లడి కాలేదు.
కలర్ వేరియంట్లు:
ఫోన్ రెండు ఆకర్షణీయమైన రంగులలో – బ్లాక్, సిల్వర్ వేరియంట్లలో మార్కెట్‌లోకి రానుంది.
కనెక్టివిటీ & పోర్టులు:
కుడివైపు: పవర్ & వాల్యూమ్ బటన్లు
ఎడమవైపు: సిమ్ ట్రే స్లాట్
కింద భాగంలో: స్పీకర్ గ్రిల్, 3.5 మిమీ హెడ్ఫోన్ జాక్, USB Type-C పోర్ట్
అంటే యూజర్లకు కావల్సిన అన్ని అవసరమైన కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.