Dussehra Recipes : ఈ దసరా పండక్కి ఈ నాలుగు రకాల పిండి వంటలు సులభంగా చేసుకుందాం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dussehra Recipes : ఈ దసరా పండక్కి ఈ నాలుగు రకాల పిండి వంటలు సులభంగా చేసుకుందాం

 Authored By prabhas | The Telugu News | Updated on :30 September 2022,9:00 pm

Dussehra Recipes :దసరా పండుగ వస్తుంది. ఈ పండుగకు ఎన్నో రకాలపిండి వంటలను రెండు మూడు రోజులు నుంచి చేస్తూ ఉంటారు. అయితే వాటిలో ఇప్పుడు మనం క నాలుగు పిండివంటలను సులభంగా తయారు చేసుకుందాం…

ముందుగా కజ్జికాయలు (Gujia) ఎలా చేయాలో చూద్దాం…

ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదాపిండి, కొంచెం బొంబాయి రవ్వ తీసుకొని వేడి వేడి నూనె దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలోకి కొంచెం నీళ్లను వేస్తూ చపాతి పిండిలాగా కలుపుకొని ఒక అర్థగంట వరకు పిండిని నానబెట్టుకోవాలి. తర్వాత ఈ కజ్జికాయల్లోకి స్టఫింగ్ కోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టి దానిలో ఒక అరకప్పు నువ్వులు వేసుకుని నువ్వులను వేయించుకోవాలి. తర్వాత పల్లీలు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని వేరువేరుగా మిక్సీ పట్టుకొని తీసుకొని కలుపుకోవాలి. తర్వాత కప్పు బెల్లాన్ని కూడా తరముకొని మళ్లీ ఈ మూడింటిని కలిపి మిక్సీ వేసుకొని దానిలో కొంచెం వెండి కొబ్బరి తురుముని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక కజ్జి కాయల కోసం పిండిని బాగా కలుపుకొని చిన్న బాల్స్లా చేసుకుని వాటిని పూరి సైజులో ఒత్తుకొని దాన్లో స్టఫింగ్ పెట్టుకుని చేతివేళ్లతో కజ్జి కాయ లాగా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి దానిలో ఈ కజ్జికాయలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకొని తీసుకోవడమే అంతే ఎంతో సులభంగా కజ్జి కాయలు రెడీ.

Dussehra Recipes :రెండోది పప్పు చెక్కలు:

దీనికోసం ముందుగా అరకప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఆ బౌల్లోకి ఐదు కప్పుల బియ్యపిండిని తీసుకుని ఈ పిండికి పది పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పుని పచ్చిమిర్చి పేస్ట్ ని కొంచెం కరివేపాకుని, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

Let's make these four types of pastry easy for this Dussehra festival

Let’s make these four types of pastry easy for this Dussehra festival

తర్వాత ఈ పిండిలో వేడి నీటిని పోసి గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిలో కొంచెం పిండిని పక్కకు తీసుకొని మిగతా పిండి పైన తడి బట్టలు కప్పుకోవాలి. ఇక ఈ పిండిని ఉండలుగా చేసుకుని ఇక ఈ చెక్కలను చేయడానికి పూరిపేస్ లేని వాళ్ళు ఒక పాలిథిన్ కవర్ను తీసుకొని దానికి కొంచెం ఆయిల్ పెట్టి ఆ ముద్దని దానిపైన పెట్టి కవర్ ని కప్పి ఒక ప్లాట్ గిన్నెను తీసుకొని ఫ్రెష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న చెక్కలన్నిటిని ఒక బట్టపై పెట్టుకోవాలి. ఇక తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసి తీసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన పప్పు చెక్కలు రెడీ.

మూడవది మిఠాయి:

ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల శనగపిండిని తీసుకొని దానిలో ఒక అర స్పూను సాల్ట్ వేసుకొని దీనిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బాగా జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి. బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని ఆయిల్లో బూందిలా వేసుకొని క్రిస్పీగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒకటిన్నర కప్పు బెల్లాన్ని తీసుకొని పావు కప్పు నీళ్లు వేసి పాకం పట్టుకోవాలి. ఇలా గట్టి పాకం వచ్చిన తర్వాత దానిలో కొంచెం యాలకుల పొడి, కొంచెం వెన్నను వేసి తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న బూందిని దీనిలో వేసి బాగా కలుపుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లో పోసుకొని చేక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా బూంది మిఠాయి రెడీ.

నాలుగోవది రిబ్బెన పకోడీ:

ముందుగా అరకప్పు పుట్నాల పప్పును తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకుని దాన్ని జల్లించి తర్వాత దానిలోకి రెండు కప్పుల బియ్యం పిండి ని వేసి ఒక టీ స్పూన్ కారం, అలాగే కొంచెం వెన్న, కొంచెం ఉప్పు, వాము వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం మసలా కాగిన నీటిని పోసి పిండిని కొంచెం పొడి పొడిగా కలుపుకోవాలి. తర్వాత ఆ నీటిని పక్కన పెట్టుకొని మురుకులు గొట్టంలో పెట్టి ముందు అప్పటికప్పుడు పిండి ముద్దను కలుపుతూ.. మురుకులు గొట్టంలో పిండి ముద్దను పెట్టి ఆయిల్ లో చెక్క పకోడీల ఒత్తుకోను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి . ఇలా అప్పటికప్పుడు పిండి కలుపుకోవడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి.. అంతే ఈ పండగ కి ఈ నాలుగు రకాల ఐటమ్స్ ను ట్రై చేయండి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది