Nani : కరీంనగర్ లో “దసరా” సక్సెస్ మీట్ లో నాని ఎమోషనల్ స్పీచ్..!!
Nani : నాచురల్ స్టార్ నాని నటించిన “దసరా” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడుతో ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో సాహసోపేతమైన సబ్జెక్టుతో “దసరా”తో నాని ఊహించిన విజయం అందుకున్నాడు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరటం జరిగింది. నాని కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. “దసరా” సినిమా విజయాన్ని ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు […]
Nani : నాచురల్ స్టార్ నాని నటించిన “దసరా” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడుతో ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో సాహసోపేతమైన సబ్జెక్టుతో “దసరా”తో నాని ఊహించిన విజయం అందుకున్నాడు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరటం జరిగింది. నాని కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. “దసరా” సినిమా విజయాన్ని ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు ప్రశంసించారు. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న నాని కరీంనగర్ లో “దసరా” సినిమా విజయోత్సవ వేడుకలలో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.
జీవితంలో అందరికీ కలలు ఉంటాయి. వాటిని జయించడానికి.. కొంతమంది సహకరిస్తారు మరి కొంతమంది నిరుత్సాహపరిస్తారు. నిరుత్సాహపరిచే వ్యక్తులను వారి మాటలను అసలు పట్టించుకోవద్దు. కన్న కల కోసం 100% కృషి చేయండి ప్రాణాలు పోయేటట్టు పోరాడండి… ఆటోమేటిక్ గా ఆ కలలు నిజమవుతాయి. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే ఇది కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనే వాళ్ళు ఎక్కువైపోయారు.
అటువంటి వారి ఆలోచనలను తప్పు అని ప్రూవ్ చేసింది “దసరా”. ఈ నెగిటివిటీ అనే చెడు మీద… “దసరా” అనే మంచి గెలిచింది. “దసరా” అంటేనే చెడుపై మంచి గెలవటం. ఈ గెలుపు సినిమా తీసిన వారికి తోపాటు చూసిన అందరికీ అని నాని అభివర్ణించారు. మీరందరూ కనుక ఇంతగా బ్రహ్మరథం పట్టకపోయి ఉంటే… మేం పడినా కష్టం వృధా అయిపోయేది. మీరు ఇచ్చిన విజయానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.. అంటూ కరీంనగర్ “దసరా” సక్సెస్ మీట్ లో నాని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.