LIC : ఎల్ఐసీలో పరీక్ష, ఫీజు లేకుండా అర్బ‌న్ కెరీర్ ఏజెంట్‌ ఉద్యోగాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

LIC : ఎల్ఐసీలో పరీక్ష, ఫీజు లేకుండా అర్బ‌న్ కెరీర్ ఏజెంట్‌ ఉద్యోగాలు

 Authored By prabhas | The Telugu News | Updated on :30 January 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  LIC : ఎల్ఐసీలో పరీక్ష, ఫీజు లేకుండా అర్బ‌న్ కెరీర్ ఏజెంట్‌ ఉద్యోగాలు

LIC : జీవిత బీమా సంస్థ (LIC)లో ఉద్యోగావ‌కాశాలు. అదీ ఎటువంటి ద‌ర‌ఖాస్తు ఫీజు, ప‌రీక్ష లేకుండా. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రధాన కేంద్రంగా LIC నోటిఫికేషన్ విడుదల చేసి అర్బన్ కెరీర్ ఏజెంట్‌గా పని చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ అర్హ‌త క‌లిగి ఉండి, 21 నుండి 35 ఏండ్ల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అభ్య‌ర్థుల‌ను నేరుగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. విజయవాడ నగర ప్రాంతానికి చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

LIC ఎల్ఐసీలో పరీక్ష ఫీజు లేకుండా అర్బ‌న్ కెరీర్ ఏజెంట్‌ ఉద్యోగాలు

LIC : ఎల్ఐసీలో పరీక్ష, ఫీజు లేకుండా అర్బ‌న్ కెరీర్ ఏజెంట్‌ ఉద్యోగాలు

వయో పరిమితి :

అర్బన్ కెరీర్ ఏజెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి వయస్సు సడలింపు ఉండదు.

జీతభత్యాలు :

ఎంపికైన అర్బన్ కెరీర్ ఏజెంట్లకు నెలకు స్టైపెండ్ చెల్లించబడుతుంది
– మొదటి సంవత్సరంలో : రూ.12,000
– రెండవ సంవత్సరంలో : రూ.11,000
– మూడవ సంవత్సరంలో : రూ.10,000

దరఖాస్తు ఫీజు :

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అర్బన్ కెరీర్ ఏజెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

అవసరమైన ధ్రువపత్రాలు :

– పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
– 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికేట్లు
– కుల ధ్రువపత్రం
– అనుభవ ధ్రువపత్రం (ఉన్నట్లయితే)

దరఖాస్తు విధానం :

LIC అర్బన్ కెరీర్ ఏజెంట్ ఉద్యోగాలకు అర్హులైన వారు క్రింది సూచనలను పాటించి దరఖాస్తు చేసుకోవచ్చు.

– విజయవాడ బ్రాంచ్ నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి లేదా సంబంధిత కార్యాలయం ద్వారా పొందండి.
– దరఖాస్తు ఫారం పూరించండి. మీ వివరాలను స్పష్టంగా మరియు కచ్చితంగా నమోదు చేయండి.
– అవసరమైన పత్రాలను జత చేయండి : అవసరమైన సర్టిఫికెట్లను సంబంధిత విధంగా జతచేసి దరఖాస్తును సిద్ధం చేయండి.
– మీ దరఖాస్తును గడువుకుముందు విజయవాడ LIC బ్రాంచ్ కార్యాలయానికి పంపండి.

ఎంపిక ప్రక్రియ :

అర్బన్ కెరీర్ ఏజెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష లేకుండా నేరుగా చేస్తారు. ఈ ప్రక్రియలో విజయవాడ ప్రాంతానికి చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు LIC నుండి ఉద్యోగ ఆఫర్ లెట‌ర్‌ పంపబడుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది