LIC Policy : మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? వెంటనే ఇలా చేయకపోతే మీ డబ్బులు రావు?
LIC Policy : మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? అయితే.. వెంటనే ఈ వార్త చదవండి. మీ దగ్గర ఎటువంటి ఎల్ఐసీ పాలసీ ఉన్నా… మీ ఎల్ఐసీ పాలసీ మెచ్యూర్డ్ అయినా సరే.. లేదా మీ ఎల్ఐసీ పాలసీని విత్ డ్రా చేసుకోవాలనుకున్నా… దాని మీద లోన్ తీసుకోవాలనుకున్నా.. మీరు ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే. లేకపోతే మీకు డబ్బులు రావు.
నిజానికి.. ఎల్ఐసీ ఇదివరకు వినియోగదారులకు డబ్బులు చెల్లించడం కోసం చెక్ విధానాన్ని ఎంచుకునేది. చెక్కుల ద్వారా డబ్బులను చెల్లించేది. కానీ… ప్రస్తుతం ఆ విధానాన్ని ఎల్ఐసీ ఆపేసింది. పాలసీదారుల ఎల్ఐసీ మెచ్యూర్డ్ అయినా… డబ్బులు విత్ డ్రా చేసుకున్నా.. వాళ్లకు ఆన్ లైన్ విధానం ద్వారా డబ్బులను వాళ్ల బ్యాంక్ అకౌంట్ కే డైరెక్ట్ గా ట్రాన్స్ ఫర్ చేస్తోంది ఎల్ఐసీ.
LIC Policy : పాలసీదారులంతా బ్యాంక్ వివరాలను ఎల్ఐసీకి సమర్పించాలి
దాని కోసం… ఎల్ఐసీ పాలసీదారులంతా ఖచ్చితంగా తమ బ్యాంక్ వివరాలను ఎల్ఐసీకి సమర్పించాల్సి ఉంటుంది. దాని కోసం నెఫ్ట్ మ్యాండేట్ ఫామ్ ను నింపి ఎల్ఐసీ ఆఫీసులో అందజేయాలి. నెఫ్ట్ మ్యాండేట్ ఫామ్ అంటే పాలసీదారుల బ్యాంకు అకౌంట్ వివరాలు సమర్పించడం. దాని కోసం బ్యాంక్ పాస్ బుక్ ను కానీ… బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ కానీ… క్యాన్సల్ అయిన చెక్ కానీ జతచేయాల్సి ఉంటుంది.
ఏదైనా ఎల్ఐసీ ఆఫీసులో ఈ పని చేయవచ్చు. బ్యాంకు వివరాలు సమర్పించిన వారంలో బ్యాంక్ అకౌంట్.. సంబంధిత పాలసీతో లింక్ అవుతుంది. ఆ తర్వాత పాలసీ మెచ్యూర్డ్ అయిన వెంటనే ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులను ఎల్ఐసీ ట్రాన్స్ ఫర్ చేస్తుంది.