Koramenu Chepala Pulusu : మట్టి కుండలో కొరమేను చేపల పులుసు… దీని టేస్ట్ వేరే లెవెల్ …
Koramenu Chepala Pulusu : చేపలు ఎన్నో రకాల చేపలు ఉంటాయి. అలాగే ఈ చేపలతో ఎన్నో వెరైటీస్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ఈ చేపలలో కొరమీను చేప ఒకటి ఈ చేపకి ధర ఎక్కువ అదే విధంగా రుచి కూడా ఎక్కువే. ఇప్పుడు దీనిని గోదావరి స్టైల్ లో చేసి చూద్దాం. ఈ చేపల కూర తిన్నవారు. వేరే లెవల్ అనాల్సిందే. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు : కొరమేను చేపలముక్కలు, చింతపండు రసం, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మెంతులు,కొత్తిమీర, అల్లం, ఎల్లిపాయలు జీలకర్ర పొడి, ధనియా పౌడర్, గరం మసాలా, టమాటాలు, కరివేపాకు, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మొదలైనవి. తయారీ విధానం : ముందుగా చేప ముక్కలను తీసుకొని దానిలో రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా రెండు మూడు సార్లు కడగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో నాలుగు స్పూన్ల ధనియాలు, రెండు యాలకులు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, వేసి పౌడర్ లాగా చేయాలి. తర్వాత 2 ఉల్లి ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసి అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా మెత్తగా నూరుకోని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టౌ పైన మట్టి కుండను పెట్టి దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి నాలుగు పచ్చిమిర్చి, ఒక స్పూన్ మెంతులు, రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత దానిలో అరకప్పు ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలను వేసి మెత్తగా అయ్యేవరకు ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టును, కొంచెం అల్లం కూడా వేయాలి.తర్వాత దానిలో రెండు స్పూన్ల కారం, రెండు స్పూన్ల ఉప్పు, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చేప ముక్కలను వేయాలి. తర్వాత దానిలో చింతపండు రసాన్ని పోసుకోవాలి. పది, పదిహేను నిమిషాల వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత దానిలో కొత్తిమీర కొంచెం వేసి మళ్లీ మూత పెట్టి దగ్గరకు అయ్యే వరకు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి దానిపైన కొంచెం కొత్తిమీర చల్లి దింపేయాలి. అంతే కుండలో కొర్రమీను చేపల కూర పులుసు. దీని టేస్ట్ వేరే లెవెల్ ఉండాల్సిందే.