Snakes : కలలో పాములు కనిపిస్తే జరిగేది ఇదే…!!
Snakes : కలలో పాములు కనిపిస్తే ఏం జరుగుతుంది. అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొందరికి ఏవేవో పీడకలలో వస్తూ ఉంటాయి. ఇంకా కొందరికి అయితే కలలో తరచుగా పాములు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా పాము లేదా పామును నేరుగా చూసిన చాలా భయం కలుగుతూ ఉంటుంది. అలాంటిది రెగ్యులర్గా పాములు కలలోకి వస్తే చాలా భయం వేస్తూ ఉంటుంది. అసలు ఇది శుభమా ఆ శుభమా పాములు కలలో వస్తే మనకు కలిసి వస్తుందా. లేదా అసలు పాములు కలలో కనిపించడానికి గల కారణాలేంటి ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్రను పరిశీలిస్తే పురాణాల ప్రకారం అయినా పాములు కలలో కనిపించడాన్ని ఎవరికి వారు తమదైన సైనిలో వివరణలు ఇచ్చారు. కొందరేమో కలలో పాములు కనిపిస్తే మంచిదని అవి మన శక్తి సామర్థ్యాలకు ప్రతీకలుగా భావించాలని సర్వశాస్త్రం ద్వారా తెలుస్తోంది. అలాగే పాములు స్వప్నంలో కనిపించే తీరును బట్టి మన భవిష్యత్తును కూడా అంచనా వేసుకోవచ్చు అని కొందరు చెబుతున్నారు.
కలలో పాములను గురించి పరిశోధించిన సిద్ధాంతం ప్రకారం కలలో పాములను చూడటాన్ని లైంగిక శక్తికి సంబంధించింది గా వివరించారు. మీరు మీ కలలో మంచం పై పామును చూస్తే లేదా పాములకు సంబంధించిన ఏదైనా శృంగార కార్యాన్ని చూసిన అది నేరుగా మీ లైంగిక జీవితం పై ప్రభావం చూపిస్తుందట.. దీంతో పాటు మీ భాగస్వామితో కలయికను కూడా ప్రతిబింధిస్తుందట అలాగే మనకు వచ్చే కలలో పాము వచ్చి అది కాటేసి వెళ్లిపోవడం రక్తం కనిపించడం వంటి విషయాలు జరిగితే ఎలాంటి ప్రమాదాలు అనేది ఉండవని సర్వశాస్త్రంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.. అదేవిధంగా మీరు నిద్రించే సమయంలో కలలో పాము కనిపించి అది నెమ్మదిగా బెడ్ పైకిందికి వెళ్ళిపోతే అప్పుడు మీ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించినట్టు అవుతుందట.. స మీకు కలలో చనిపోయిన పాము కనిపిస్తే మీరు రాహు దోషం వల్ల కలిగే అన్ని సమస్యలను అధిగమిస్తారని మీ శుభముహూర్తాలు ఇప్పటినుండి ప్రారంభమవుతాయని అర్థం. అలాగే మీ కలలో పాము ఎక్కడికో వెళ్తున్నట్లు లేదా మిమ్మల్ని చూసిన తర్వాత దాక్కునట్లు కనిపిస్తే దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు అని అర్థం.
ఇక మీ కలలో పాము తన కుబుసం తొలగిస్తున్నట్లు మీరు కలగన్నట్లయితే కనుక మీరు త్వరలో సంపాదన పొందుతారని సూచిస్తుంది. మీ కలలో పాము పుట్టలోకి వెళ్తున్నట్టు కలలు కంటునట్లయితే కనుక మీకు త్వరలో డబ్బులు లభిస్తుందని సూచిస్తుంది. దీని వల్ల చాలా డబ్బు వస్తుంది. ఇది భగవంతుని రూపంగా పరిగణించబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మనం పడుకునేటప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటే అలా మన కలలు కూడా ఉంటాయి అన్నది నిజం. మన మానసిక స్థితికి ప్రతిరూపాలే మన కలలు అని చెప్పాలి.. అందుకే మనం పడుకునే సమయంలో ఆనందంగా ఉండాలి. మానసిక ఆందోళనలు ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా హాయిగా నిద్రపోవాలి. బాధతో ఉంటే వచ్చే కలలో మరోలా ఉంటాయి. మనం పడుకోబోయే ముందు ఏదైతే ఆలోచిస్తామో ఆ అంశానికి సంబంధించి కలలే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే పడుకోబోయే ముందు దేని గురించి ఆలోచిస్తామో ఆ కలలో అత్యధికంగా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి.