Viral Video : ఈ విష సర్పం ఇసుకలో దాక్కుని ఎలా దాడి చేస్తుందో తెలుసా?
Viral Video : సాధారణంగా ప్రజలు పామును దేవుడని పూజిస్తుంటారు. కానీ, అదే పాము ఇంటి లోపలోనో ఇంకెక్కడైనా కనబడితే మాత్రం భయపడిపోతుంటారు. కొంత మంది అయితే పామును చూడగానే భయపడిపోతారు. వారి ఒళ్లు జలదరిస్తుంటుంది. అందులో మనం కూడా ఉంటాం. ఇకపోతే పాముల్లోనూ రకాలుంటాయి. కాగా, రక్త పింజరి పాము తనకంటూ కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ పాముకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ పాము ఏం చేస్తుందంటే..
ప్రకృతిలో మానవుడికి ఏ విధంగానైతే తెలివి తేటలుంటాయో అదే విధంగా జంతువులకూ ఉంటాయి. అలా పాములు కూడా ప్రత్యేకమైన ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ రక్త పింజరికి సంబంధించిన వీడియో ఒకటి అమేజింగ్ నేచర్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా, అది నెట్టింట హల్ చల్ చేస్తోంది. అది చూసి నెటిజన్లు వావ్ అమేజింగ్ అని అంటున్నారు. తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు అవసరమైతే దాడి చేయడంలో ఈ రక్త పింజరి స్పెషలిస్ట్ అని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.
Viral Video : అలా ఇసుకలో ఉండి.. తనపైకి వస్తే కనుక అకస్మాత్తుగా దాడి..
ఇకపోతే సదరు వైరల్ వీడియోలో విషసర్పమైన రక్త పింజరి..ఇసుకలో అలా దాచుకోవడాన్ని మనం చూడొచ్చు. అసలు ఇసుకలో తాను లేను అన్న రీతిలో రక్త పింజరి క్రమంగా దాచుకుంటుంది. ఇక ఒకవేళ ఏదేని దాడి జరిగినట్లయితే వెంటనే రక్త పింజరి బయటకు వచ్చి దాడి చేయగలదు. అలా ఈ విష సర్పంలో ఇసుకలోపల దాక్కుని మరి తన కళ్లతో బయటి ప్రపంచాన్ని చూడగలదు. ఈ వీడియో ను చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.
This is how a sand viper conceals itself to ambush prey.
Credit: Javier Aznar https://t.co/LXe7AuWDBu pic.twitter.com/jt9mCooSZv
— Amazing Nature (@AmazingNature00) February 3, 2022