Man Without Heart : ఈ వ్యక్తికి గుండె లేదు.. హార్ట్ లేకుండా బతికిన తొలి వ్యక్తి ఈయనే.. ఆ తర్వాత ఏమైందంటే?
Man Without Heart : గుండె లేదా హార్ట్.. అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అది లేకుంటే చాలా కష్టం. గుండె అనేది ఎంతో ముఖ్యమైనది, అది ఒక్క సెకండ్ ఆగినా కూడా మనం బతకలేం. ఎందుకంటే గుండె 24 గంటలు కొట్టుకుంటూ ఉంటేనే మన మనుగడ సాధ్యం అవుతుంది. లేకపోతే చాలా కష్టం. ఒకవేళ గుండె సరిగ్గా పనిచేయకపోతే.. గుండె పనిచేసేలా పేస్ మేకర్ కానీ.. ఇంకా ఏదైనా యంత్రాన్ని కానీ ఉపయోగించాల్సి ఉంటుంది. అలా.. యంత్రం మీద మనిషి బతికినా అది కొన్ని రోజులు మాత్రమే. పూర్తి స్థాయిలో బతకడం అనేది చాలా కష్టం.
కానీ.. ఒక వ్యక్తి అది కూడా వృద్ధుడు గుండె అనేదే లేకుండా నెల రోజులు బతికాడు. షాక్ అయ్యారు కదా. కేవలం గుండె మాత్రమే కాదు.. ఆయన పల్స్ కూడా లేదు. అసలు.. గుండె లేకుండా.. పల్స్ లేకుండా ఆ వ్యక్తి అన్ని రోజులు ఎలా బతికాడు అనేదే ఇప్పుడు సస్పెన్స్. ఆయన పేరే క్రేగ్ లివిస్. ఆయన వయసు 55 ఏళ్లు. అమిలాయిడ్ డోసిస్ అనే ఒక అరుదైన వ్యాధి అతడికి సోకింది. ఆ వ్యాధి వల్ల అతడికి గుండె, కిడ్నీ, లివర్ పాడయ్యాయి. దీంతో టెక్సాస్ లో ఉన్న హార్ట్ ఇనిస్టిట్యూట్ లో చేర్పించారు.
Man Without Heart : లివిస్ గుండె తీసేసి మిషన్ ను ఏర్పాటు చేసిన డాక్టర్లు
అతడి గుండె పూర్తిగా పాడవడంతో గుండెను తీసేసి దాని స్థానంలో ఒక మిషన్ ను పెట్టి దాని ద్వారా రక్తాన్ని సరఫరా చేయించాలని భావించారు. పల్స్ లేకున్నా ఆ మిషన్ ద్వారా రక్త ప్రసరణ కొనసాగించవచ్చు. దీంతో అతడి గుండెను తీసేసి.. ఆ మిషన్ ను అమర్చారు. గుండె తీయగానే.. అతడి పల్స్ ఆగిపోయింది. అయినా కూడా ఆ మిషన్ ను ఏర్పాటు చేయడంతో.. దాదాపు నెల రోజుల పాటు కేవలం పల్స్ లేకుండానే అతడు బతికి బట్టకట్టాడు. కేవలం మిషన్ సపోర్ట్ తో గుండె లేకున్నా బతికినప్పటికీ.. ఒక నెల రోజుల తర్వాత మాత్రం ఆయన చనిపోయాడు. అలా.. ఆ వ్యక్తి గుండె లేకుండా బతికిన తొలి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశాడు.