Morning Habits : గాలి కాల్యుషం నుంచి చెక్ పెట్టే మార్నింగ్ అలవాట్లు ఇవే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Morning Habits : గాలి కాల్యుషం నుంచి చెక్ పెట్టే మార్నింగ్ అలవాట్లు ఇవే..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 January 2026,7:00 am

ప్రధానాంశాలు:

  •  Morning Habits : గాలి కాల్యుషం నుంచి చెక్ పెట్టే మార్నింగ్ అలవాట్లు ఇవే..!

Morning Habits : ప్రస్తుతం కాలంలో గాలి కాలుష్యం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మన శరిరంలో ఊపిరితిత్తులు, గుండె, రోగనిరోధక శక్తిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజును ఎలా ప్రారంభిస్తున్నామన్నది చాలా కీలకం. ఉదయానే కొన్ని చిన్న చిన్న అలవాటు చేసుకుంటే శరీరం ఫిట్‌గా ఉండటంతో పాటు కాలుష్య ప్రభావాలను కూడా ఎదుర్కోగలదు.

Morning Habits గాలి కాల్యుషం నుంచి చెక్ పెట్టే మార్నింగ్ అలవాట్లు ఇవే

Morning Habits : గాలి కాల్యుషం నుంచి చెక్ పెట్టే మార్నింగ్ అలవాట్లు ఇవే..!

Morning Habits  : పరగపున గోరు వెచ్చని నీటిని ఎందుకు తాగాలి

ఉదయం పరగడపన ఒక గ్లాస్గోరువెచ్చని వెచ్చని నీటిని తాగడం చాలా మంచిది. ఇది శరీరాన్ని హైడ్రెట్ చేయడంలో సహాయపడుతుంది. గాలిలోని మలినాలు శరీరంలోకి చేరిన విషపదార్థాలను బయటకు పంపించడానికి నీరు కీలక పాత్ర పోషిస్తుంది.ప్రతి రోజును తగినత్త నీటి తీసుకుంటే శరీరంలో హైడ్రేషన్‌తో ప్రారంభిస్తే శరీరం మరింత శక్తితో నిండి ఉంటుంది.

Morning Habits గాలి పరిమాణం ఎంత ఉందో చూసుకొని వ్యాయామం చేయడం అవసరం

ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే, కానీ గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో బయట వ్యాయామం చేయడం హానికరం కావచ్చు. అందుకే,బయటకు వెళ్లే ముందు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తెలుసుకోవాలి. గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో ఇంట్లోనే యోగా, స్ట్రెచింగ్ లేదా లైట్ వర్కౌట్ చేయడం ఉత్తమం.

యోగా, ప్రాణాయామం తో ఊపిరితిత్తులకు బలం :

ప్రాణాయామం, గట్టిగా గాలి పీలిచి వదలడం, ఎక్సర్‌సైజ్‌లు, ఆసనాలు వంటివి కాలుష్య ప్రభావాలను తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. ఇవి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి శ్వాసకోశ వ్యవస్థను బలపరుస్తాయి. రోజూ 10–15 నిమిషాలు ప్రాణాయామం చేయడం వల్ల శరీరం గాలిలోని హానికర కణాలతో పోరాడి నిలబడగలదు.

పోషకాహారంతో రోగనిరోధక శక్తి పెంపు :

మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. అప్పుడే శరీరానికి శక్తి పుష్కలంగా అందుతుంది. తాజా పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాలుష్యం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి శరీరానికి సరైన పోషణ చాలా అవసరం.

ఉదయం ఏ సమయంలో బయటకు వెళ్ళాలి :

ఉదయం తెల్లవారుజామున లేదా సాయంత్రం సమయంలో గాలి కాలుష్యం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకే ఆ సమయాల్లో బయట నడక లేదా జాగింగ్ చేయడం మానేయాలి. గాలి కొంత శుభ్రంగా ఉన్న మధ్య తెల్లవారిన తరువాత ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లడం ఆరోగ్యానికి మంచిది.

రోజంతా యాక్టీవ్‌గా ఉండాలంటే..? :

మీ రోజు దినచ్చేరియాలో ఉదయం చేసే చిన్న చిన్న మార్పులే, ఆ రోజంతా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. సరైన హైడ్రేషన్, నియంత్రిత వ్యాయామం, పోషకాహారం, శ్వాసాభ్యాసాలు కలిస్తే శరీరం కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ స్మార్ట్ మార్నింగ్ అలవాట్లను పాటిస్తే ఆరోగ్యంగా, ఫిట్‌గా జీవించవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది