Viral Video : కూతురు శవంను కాలి నడకన 35 కి.మీ మోసుకు వెళ్లిన తండ్రి
Viral Video మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా మంట కలిసిందేమో అంటూ కొన్ని సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తు ఉంటుంది. ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాలు ఇంకా అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నాయి. అక్కడ చాలా ప్రాంతాలకు కనీస రోడ్డు సౌకర్యం కూడా లేదు. దాంతో ఎవరైనా మృతి చెందినా ఏదైనా అత్యవసరం అయినా కూడా కాలి నడకన పదుల కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇటీవల ఒక తండ్రి తన కూతురు శవంను పోస్ట్ మార్టం కోసం ఏకంగా 35 కిలో మీటర్లు కావడి కట్టి మోసుకు వెళ్లిన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన వీడియోను ఒక నెటిజన్ షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యి దేశంలో ఉన్న దారుణ పరిస్థితికి అద్దం పడుతుంది.
16 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య.. Viral Video
సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… మహారాష్ట్ర సింగ్రౌలీ జిల్లా గడాయి గ్రామానికి చెందిన ధీరపతి సింగ్ గోండ్ కూతురు ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ కోసం ఆత్మహత్య చేసుకున్న యువతి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయాలని చెప్పారు. పోలీసులు యువతి డెడ్ బాడీని తీసుకు రావాల్సిందిగా ధీరపతికి చెప్పి వెళ్లి పోయారు. కూతురు డెడ్ బాడీని తీసుకు వెళ్లేందుకు ఆర్థికంగా స్థోమత లేకపోవడంతో తెలిసి వారి సాయంతో డెడ్ బాడీని ఒక మంచి కావడి కట్టి దాదాపు 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు.
వైరల్ వీడియో…
35 కిలో మీటర్లు ప్రయాణించిన ధీరపతిని దారిలో పలువురు కలిశారు కాని ఏ ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఒక వ్యక్తి ఈ సంఘటనను వీడియో తీసి షేర్ చేయగా కొన్ని గంటల్లో వైరల్ అయ్యింది. 35 కిలో మీటర్ల దూరంను ధీరపతి 7 గంటల్లో చేరాడు. ఉదయం 9 గంటలకు గ్రామం నుండి కూతురు శవంతో బయలుజేరిన ధీరపతి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేప్పటికి సాయంత్రం 4 అయ్యింది. ఈ సంఘటన ప్రభుత్వాల తీరుకు నిదర్శణం అని.. ఇలాంటి వీడియోలను చూసి అయినా ప్రజా ప్రతినిధులు సిగ్గు తెచ్చుకోవాలంటూ నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
A man was forced to carry his daughter’s body on a cot for post-mortem for 35 km, walking for almost seven hours to reach the hospital in Singrauli @ndtv @ndtvindia pic.twitter.com/cNMYsWVzNh
— Anurag Dwary (@Anurag_Dwary) May 9, 2021