Masala Egg Biryani : అద్భుతమైన మసాలా ఎగ్ బిర్యానీ కుక్కర్లో ఎంతో ఈజీగా ఇలా ట్రై చేయండి…
Masala Egg Biryani : మనం ఎన్నో వెరైటీస్ ని హోటల్లో టేస్ట్ చేస్తూ ఉంటాం.. కానీ అదే రుచి మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఆ రుచి రాదు.. అలాంటి వారికి ఇప్పుడు మసాలా ఎగ్ బిర్యానీ హోటల్లో తిన్నట్లుగా అదే టెస్ట్ తో రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా ఆ రుచి వస్తుంది. కావాల్సిన పదార్థాలు : బాస్మతి బియ్యం, ఎగ్స్, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, సాజీర, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, జాజిపూవు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు టమాట ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, ఒక కప్పు పెరుగు, కొత్తిమీర ,పుదీనా, నిమ్మరసం నీళ్లు ,నెయ్యి ,నూనె మొదలైనవి…
తయారీ విధానం : ముందుగా రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి నాలుగు గుడ్లను తీసుకొని వాటికి గాట్లు పెట్టి కొంచెం పసుపు వేసి వాటిని ఎర్రగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అది ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు, నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, ఒక జాపత్రి, కొంచెం జీలకర్ర, కొంచెం సాజీర, వేసి వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.
తరువాత కొంచెం కరివేపాకు ఒక కప్పు టమాటా ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం పెరుగు, కూడా వేసి కొంచెం వాటర్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించుకొని తర్వాత నాలుగు కప్పుల నీళ్లను వేసుకొని దానిలో రుచికి సరిపడేంత ఉప్పుని వేసి దానిలో ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా వేసి నీళ్లు మసలా కాగేటప్పుడు దానిలో ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వేసుకొని దాన్లో ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసి ఇక మూతను పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచుకోవాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పాటు స్టవ్ కట్టేసి ఉంచి తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా మసాలా ఎగ్ బిర్యానీ రెడీ.