వ్యాక్సిన్ తీసుకున్న వరుడు మాత్రమే కావలెను.. వామ్మో.. ఇటువంటి పెళ్లి యాడ్స్ కూడా ఇస్తారా?
Matrimonial Ad : ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాప్తి చెందుతోంది. అందుకే.. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే.. కరోనా సెకండ్ వేవ్ రాకముందు నుంచే కోవిడ్ వ్యాక్సిన్ ను అందజేస్తున్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఆ తర్వాత 18 ఏళ్లు నిండిన వాళ్లకు కూడా వ్యాక్సిన్లు వేస్తున్నారు. దాదాపు అందరికీ వ్యాక్సిన్లు వేయడం పూర్తి అయితే.. కరోనాను పూర్తిగా నిర్మూలించినట్టే.సరే.. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకోకపోతే.. కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఎటైనా దూర ప్రయాణం చేసినా.. ఎక్కడికైనా వెళ్లాలన్నా.. కొన్ని చోట్ల.. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ధృవ పత్రాన్ని చూపించాలంటూ అడుగుతున్నారు. ఒకవేళ దాన్ని చూపించలేకపోతే.. అనుమతించడం లేదు. దీంతో.. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే.అయితే.. అది అక్కడితోనే ఆగలేదు. చివరకు పెళ్లి విషయంలో కూడా కరోనా వ్యాక్సిన్ ఇన్వాల్వ్ అయిపోయింది. మా అమ్మాయికి మంచి వరుడు కావాలి కానీ.. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న యువకుడు మాత్రమే మమ్మల్ని సంప్రదించండి.. అంటూ ఓ ఫ్యామిలీ మ్యాట్రిమోనియల్ యాడ్ ఇచ్చింది. ఆ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
Matrimonial Ad : వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటేనే మమ్మల్ని సంప్రదించండి
నిజానికి.. మ్యాట్రిమోనియల్ యాడ్స్ లో కులం, మతం, ఉద్యోగం లాంటి విషయాలను అడుగుతారు కానీ.. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ను కూడా చేర్చారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వాళ్లు మాత్రమే.. మమ్మల్ని సంప్రదించండి.. అంటూ పేపర్ లో ఇచ్చిన ఆ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. సెలబ్రిటీలు కూడా ఆ యాడ్ ను తెగ వైరల్ చేస్తున్నారు. అయితే.. అది నిజానికి నిజమైన యాడ్ కాదు. అది ఉత్తుత్తి యాడ్ మాత్రమే. వ్యాక్సినేషన్ గురించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు గోవాకు చెందిన ఓ వ్యక్తి ఇలా ఫేక్ యాడ్ ను సృష్టించాడట. అయితే.. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాంటి ప్రకటనలు వచ్చినా చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా.. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది.