Mekapati Gautam Reddy : మేకపాటి గౌతం రెడ్డికి పార్టీతో సంబంధం లేదు, టీడీపీ సంతాపం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mekapati Gautam Reddy : మేకపాటి గౌతం రెడ్డికి పార్టీతో సంబంధం లేదు, టీడీపీ సంతాపం…!

 Authored By prabhas | The Telugu News | Updated on :21 February 2022,10:15 am

Mekapati Gautam Reddy : ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కాసేపటి క్రితం కన్ను మూశారు. యువ మంత్రిగా ఏపీ ప్రభుత్వంలో కీలక శాఖ నిర్వహిస్తున్న గౌతం రెడ్డి… నిన్ననే దుబాయి నుంచి తిరిగి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యే గా గెలిచిన మేకపాటి రెండో సారి గెలిచినా తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చేన్నాయుడు స్పందించారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసింది అన్నారు కింజరాపు అచ్చెన్నాయుడు . రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాల్సిన గౌతమ్ రెడ్డిని మృత్వువు కబళించింది అని ఆవేదన వ్యక్తం చేసారు.

Mekapati Gautam Reddy TDP mourning

Mekapati Gautam Reddy TDP mourning

గౌతమ్ రెడ్డి పార్టీలతో సంబందం లేకుండా అందిరితోను ఆప్యాయంగా కలిసిపోయేవారని అన్నారు. హుందాగా ప్రవర్తించేవారు అని ‎ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు అచ్చెన్న. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది