Clark Divorce : వామ్మో ..300 కోట్లు ఇచ్చి భార్యను వదిలించుకున్న స్టార్ట్ క్రికెటర్
ప్రధానాంశాలు:
Clark Divorce : వామ్మో .. 300 కోట్లు ఇచ్చి భార్యను వదిలించుకున్న స్టార్ట్ క్రికెటర్
Michael Clarke Divorce : ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మైఖేల్ క్లార్క్, తన వ్యక్తిగత జీవితంలోని కీలక మలుపుతో ఇప్పుడు వార్తల్లో నిలిచారు. రికీ పాంటింగ్ వంటి దిగ్గజం నుంచి పగ్గాలు అందుకుని, 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఘనత క్లార్క్‌ది. అయితే, మైదానంలో ఎన్నో విజయాలు అందుకున్న ఈ స్టార్ క్రికెటర్, తన వైవాహిక జీవితంలో మాత్రం ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2012లో ఒక ఆస్ట్రేలియన్ మోడల్‌ను వివాహం చేసుకున్న క్లార్క్, సుమారు ఏడేళ్ల క్రితమే ఆమెతో విభేదాల కారణంగా విడిపోయారు. తాజాగా వీరి విడాకుల ప్రక్రియ అధికారికంగా ముగియడమే కాకుండా, అది ఒక భారీ ఆర్థిక సెటిల్‌మెంట్‌గా నిలిచింది.
Clark Divorce : వామ్మో ..300 కోట్లు ఇచ్చి భార్యను వదిలించుకున్న స్టార్ట్ క్రికెటర్
క్లార్క్ వైవాహిక బంధం విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిగత ప్రవర్తనే అనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ముఖ్యంగా తన లేడీ అసిస్టెంట్‌తో క్లార్క్‌కు ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలిసిన తర్వాతే ఆయన భార్య విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ఆస్ట్రేలియన్ మీడియా కోడైకూసింది. 2020 నుంచే ఈ జంట వేర్వేరుగా నివసిస్తుండగా, ఆ సమయంలోనే వీరి మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరాయి. ఒక పక్క క్రికెట్ విశ్లేషకుడిగా, వ్యాపారవేత్తగా క్లార్క్ రాణిస్తున్నప్పటికీ, ఇంటి గడప దాటిన ఈ వివాదం చివరకు కోర్టు మెట్లు ఎక్కి భారీ మూల్యాన్ని చెల్లించేలా చేసింది.
ఈ విడాకుల సెటిల్‌మెంట్ విలువ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మొత్తం 40 మిలియన్ డాలర్ల (సుమారు భారత కరెన్సీలో 300 కోట్ల రూపాయలు) భారీ మొత్తాన్ని తన మాజీ భార్యకు చెల్లించి క్లార్క్ ఈ వివాదానికి స్వస్తి పలికారు. క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన విడాకుల సెటిల్‌మెంట్లలో ఒకటిగా నిలిచిపోయింది. వీరికి ఉన్న ఏకైక కుమార్తె బాధ్యతలను కూడా క్లార్క్ తన మాజీ భార్యకే అప్పగించారు. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తిలో సగం కంటే ఎక్కువ మొత్తాన్ని ఇలా విడాకుల రూపంలో కోల్పోవడం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.